మహానటి సావిత్రి జీవిత కథతో సినిమా అన్నపుడు ఆమెను అన్ని రకాలుగా మ్యాచ్ చేసే నటి ఈ తరంలో ఎవరున్నారా అని ఆశ్చర్యంగా చూశారంతా. చాలా పేర్లను పరిశీలించి చివరికి కీర్తి సురేష్ ను ఈ పాత్రకు ఎంచుకున్నాడు దర్శకుడు నాగ్ అశ్విన్. ఐతే మొదట్లో ఈ నిర్ణయం పట్ల వ్యతిరేకత వ్యక్తమైంది. పెద్దగా అనుభవం లేని కీర్తి.. సావిత్రి పాత్రలో ఎలా మెప్పిస్తుందో అన్న సందేహాలు నెలకొన్నాయి. కానీ ఇటీవలే సావిత్రిగా కీర్తి కనిపిస్తున్న ఫొటోలు.. వీడియోలు చూస్తుంటే సందేహాలన్నీ పటాపంచాలయ్యాయి. నిజానికి ఈ సినిమాకు తనను ఎంచుకున్నపుడు సావిత్రి పాత్ర చేయగలనా అని తనకే తనపై అనుమానం కలిగిందని.. జనాలకు అలా అనుమానం కలగడంలో ఆశ్చర్యమేమీ లేదని ఆమె అంది. ఈ పాత్ర చేయడానికి తాను ఎంతో కష్టపడ్డానని.. ఇలా ఏ సినిమాకూ అంత కష్టం పడలేదని ఆమె అంది.
ఏడాదిన్నర పాటు సావిత్రిలా నటిస్తూ.. హావభావాలు పలికిస్తూ.. సాగేసరికి ఇప్పుడు తాను సావిత్రిలా మారిపోయిన భావన కలుగుతోందని కీర్తి చెప్పింది. సావిత్రికి.. తనకు అభిరుచుల విషయంలో చాలా పోలికలున్నాయని తెలిసి తాను చాలా ఆశ్చర్యపోయినట్లు కీర్తి వెల్లడించింది. తనకు చిన్నప్పట్నుంచి క్రికెట్ అన్నా.. ఈత అన్నా చాలా ఇష్టమని.. సావిత్రికి కూడా అవి ఇష్టమని తెలిసిందని కీర్తి చెప్పింది. సావిత్రి షూటింగ్ సమయంలో చాలా సరదాగా ఉండేవారని.. అడిగిన వారికి తరతమ భేదం లేకుండా సాయం చేసేవారని.. ఈ విషయాలన్నీ తెలిసి ఆమెపై అభిమానం మరింత పెరిగిందని కీర్తి తెలిపింది. సావిత్రి లుక్ కోసం ఎన్నో గెటప్పులు ట్రై చేశామని.. ఇక ఆ పాత్ర లో నటించేటపుడు తాను ఎన్నో టేకులు తీసుకున్నానని.. ఆమెలా నవ్వి.. ఆమెలా నడిచి.. ఆమెలా డ్యాన్స్ చేసి... ఇలా అన్నీ ఆమెలా చేయడం ద్వారా సావిత్రి లాగే మారిపోయానంది కీర్తి.