బికినీ వేస్తోంది అంటే తిట్టిపోసింది!

Update: 2020-05-13 05:30 GMT
బికినీలు టూపీస్ ల‌తో మెరిపించ‌డం అన్న‌ది ఓ అంద‌మైన‌ క‌ళ‌. అందు‌కు ప‌ట్టు విడుపు ఉండాలి. చాలా క‌ళాత్మ‌క ఆలోచ‌న‌ల‌తో పాటు.. బోలెడంత శారీర‌క శ్ర‌మ .. ప‌ట్టుద‌ల అవ‌స‌రం. జిమ్ కి వెళ్లి క‌స‌ర‌త్తులు చేయాలి. బ‌రువులెత్తాలి.. ప‌రుగులెత్తాలి. స్విమ్మింగ్ పూల్ లో ఈత కొట్టాలి. నానా యాత‌న‌లు ఉంటాయి. అనుకోగానే అయిపోయేది కాదు. అయినా అంత క‌ష్టం ఉన్నా కానీ మ‌న అందాల క‌థానాయిక‌లు నిరంత‌రం ఎంతో హార్డ్ వ‌ర్క్ చేస్తూ స్లిమ్ లుక్ ని మెయింటెయిన్ చేస్తుండ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తూనే ఉంటుంది.

అనుష్క‌.. న‌మిత‌.. న‌య‌న‌తార.. మీరా జాస్మిన్ లాంటి బొద్దుగుమ్మ‌లే బికినీ వేయ‌డం కోసం ఎంతో క‌ఠినంగా వ్యాయామాలు చేశారు. ఇక మ‌ల‌యాళ ముద్దుగుమ్మ బొద్దుగుమ్మ కీర్తి సురేష్ గ‌త కొంత‌కాలంగా సైజ్ జీరో కోసం ట్రై చేస్తూ ఉండ‌డం.. ఆ ఫోటోలు వెబ్ లో చూసి ఫ్యాన్స్ షాక్ కి గుర‌వ్వ‌డం తెలిసిందే. ఒకానొక ఫోటోలో అస‌లు ఈవిడ మ‌న కీర్తి యేనా? మ‌హా న‌టి కీర్తి యేనా? అన్న సందేహం కూడా క‌లిగింది. మ‌రీ పీల‌గా త‌యారైన ఆ ఫోటో చూశాక బొద్దుగానే ముద్దొచ్చావు క‌దా! అంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేశారు. అయితే కీర్తి మ‌రీ ఇంత‌గా సాహ‌సం ఎందుకు చేస్తోంది? ఉన్న అందాన్ని ఎందుక‌ని చెడ‌గొట్టుకుంటోంది. చ‌క్క‌ని చుక్క కాస్తా అలా పీల‌గా బ‌క్క‌గా అయిపోయిందేమిటి! అంటూ కొంద‌రు ఫ్యాన్స్ క‌ల‌త‌కు గుర‌య్యారు.

ఇదంతా బికినీ వేసేందుకు టూపీస్ లో క‌నిపించేందుకేనంటూ సోష‌ల్ మీడియాలో సాగుతున్న‌ ప్ర‌చారంపై కీర్తి చాలానే గుర్రుగా ఉందిట‌. అయినా అదేమీ బికినీ వేసేందుకు కాదు.. కేవ‌లం ఆరోగ్యంగా ఉండేందుకు మాత్ర‌మేన‌ని చెబుతోందిట‌. ఇలాంటి త‌ప్పుడు ప్ర‌చారం మానుకోవాల‌ని మీడియాని కోరింది. ఇక మిస్ ఇండియా చిత్రంలో బికినీ వేసేందుకే కీర్తి ఇలా స‌న్న‌బ‌డిందా? అన్న డిబేట్ కి చెక్ ప‌డిపోయినట్టే.  అయినా అదేమైనా బికినీకి సూట‌య్యే బాడీనా?   ఏవో ప‌ట్టు చీరలు.. మోడ్ర‌న్ ఔట్ ఫిట్స్ మిన‌హా స్విమ్ సూట్లు బికినీలు త‌న‌కు సూట్ కావేమో! అది గ్ర‌హించే అలాంటి వాటి జోలికి కీర్తి సురేష్ వెల్ల‌డం లేద‌ని అనుకోవాల్సి ఉంటుంది మ‌రి. కీర్తి ప్ర‌స్తుతం బాలీవుడ్ లో ఓ సినిమా చేస్తోంది. తెలుగు-త‌మిళంలోనూ సినిమాలతో బిజీగా ఉంది.


Tags:    

Similar News