రూల్స్ స్టార్ హీరోలకేనా? కథానాయికలకు ఉండకూడదా? ఏదైనా కథ వినిపిస్తే వెంటనే ఓకే చెప్పాలన్నా.. స్టార్ హీరోతో నటించాలా వద్దా అన్నది నిర్ణయించుకోవాలన్నా.. ఆ హక్కు అందాల భామలకు ఉండదా? అంటే.. ఎందుకని ఉండదు. మహానటి కీర్తి సురేష్ లా థింక్ చేస్తే సరి!
ఇప్పటికే మహానటి కీర్తి సురేష్ పై ఈ తరహా వరుస కథనాలు హీటెక్కిస్తున్నాయి. టాలీవుడ్ లో ఇప్పటికే కీర్తి అరడజను పైగా ఆఫర్లను వదులుకుందని అందులో మెగా హీరోల ఆఫర్లు కూడా ఉన్నాయన్న టాక్ నడుస్తోంది. ఇంతకుముందు యూత్ స్టార్ నితిన్ సరసన `అంధాధున్` రీమేక్ లో నటించే అవకాశం వచ్చింది. అందులో రొమాన్స్ డోస్ అధికంగా ఉందని తిరస్కరించిందట.
తాజాగా మెగా హీరోలతో ఆఫర్లను రకరకాల షాకులు చెప్పి వదులుకుందని ప్రచారం సాగుతోంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించనున్న ఐకన్ లో ఇద్దరు హీరోయిన్ల అవసరం ఉంది. అందులో ట్రెడిషనల్ అమ్మాయి తరహా రోల్ ఒకటి ఉంది. సంప్రదాయ బద్ధంగా కట్టు బొట్టుతో కనిపించినా ఆ పాత్రలో కాస్త రొమాంటిక్ డోస్ ఎక్కువగా ఉంటుందట. దీంతో ఆ ఆఫర్ ని తిరస్కరించిందని పుకార్ వినిపించింది. అలాగే సాయి తేజ్ సరసన నటించే సినిమా కథతో పాటు తన పాత్ర నచ్చకపోవడం వల్లనా వదులుకుందట.
ఇక ఇప్పటివరకూ టాలీవుడ్ లో అగ్ర హీరోలతో కీర్తికి ఆఫర్లు ఏవీ లేవు. పవన్ కల్యాణ్ సరసన అజ్ఞాతవాసి తర్వాత ఇంకే పెద్ద హీరోతోనూ ఛాన్స్ దక్కలేదు. ఇన్నాళ్టికి మహేష్ -పరశురామ్ కాంబినేషన్ మూవీ `సర్కార్ వారి పాట`లో కథానాయికగా అంగీకరించింది. ఎందుకనో అగ్ర హీరో బన్ని సరసన ఆఫర్ వచ్చినా తిరస్కరించింది. అయితే ఇలా చేయడానికి కారణమేమిటి? అన్నది ఆరా తీస్తే.. హద్దు మీరిన ఎక్స్ పోజింగ్ కి అతిగా ఉండే రొమాన్స్ సీన్స్ కి అస్సలు అంగీకరించడం లేదు. అలాగే కథ నచ్చకపోయినా.. తన పాత్రకు నటించేందుకు ఆస్కారం లేకపోయినా నిరభ్యంతరంగా తిరస్కరిస్తోంది. తమిళంలో విజయ్ లాంటి హీరోల సరసన నటిస్తోంది. తెలుగులో మాత్రం పరిమితంగానే గ్రీన్ సిగ్నల్ ఇస్తోందిట. నాయికా ప్రాధాన్యతను చూస్తోందట.