సూర్యన‌మ‌స్కారాల‌తో మ‌హాన‌టి సందేశం

Update: 2021-06-02 14:30 GMT
యోగాతోనే అందం ఆరోగ్యం. మాన‌సిక స‌మ‌స్య‌ల‌ను అధిగ‌మించేందుకు యోగా ప‌ని చేస్తుంది. స్లిమ్ లుక్ కావాల‌న్నా యోగాతో సాధ్య‌మే. మ‌లైకా.. శిల్పాశెట్టి.. సోఫీ చౌద‌రి ..ర‌కుల్ ప్రీత్.. ఉపాస‌న ఇలా టాప్ సెల‌బ్రిటీలంతా యోగాభ్యాసంతో త‌మ లుక్ ని పూర్తిగా మార్చుకున్నారు. కాల‌క్ర‌మంలో యోగా గురువులుగానూ మారారు.

ఇప్పుడు అదే బాట‌లో ప్ర‌యాణిస్తోంది మ‌హాన‌టి కీర్తి సురేష్. ఈ భామ తాజాగా వేకువ ఝామున యోగా ప్రాక్టీస్ చేస్తున్న ఓ ఫోటోని షేర్ చేయ‌గా అభిమానుల్లో వైర‌ల్ గా మారింది. తొలిగా యోగాకు ముందు సూర్య న‌మ‌స్కారాల్ని ప్రాక్టీస్ చేస్తూ క‌నిపించింది కీర్తి. ఇలా సూర్య న‌మ‌స్కారాల‌తో మ‌హాన‌టి సందేశం ఏమిటి? అంటే .. ఈ క‌ష్ట‌కాలంలో మ‌న‌శ్శాంతికి మాన‌సికానందానికి చ‌క్క‌ని ఆరోగ్యానికి ఇది చాలా అవ‌స‌రం అని చెప్ప‌క‌నే చెబుతున్నారు. ఇంట్లోనే త‌క్కువ స్థ‌లంలో సూర్య న‌మ‌స్కారాలు యోగా ప్రాక్టీస్ కి ఎవ‌రికైనా అవ‌కాశం ఉంటుంది. విధిగా ప్ర‌తి ఒక్క‌రూ అనుస‌రించాల‌ని సందేశ‌మిస్తోంది.

కెరీర్ మ్యార్ కి వ‌స్తే.. ప్ర‌స్తుతం మ‌హేష్ స‌ర‌స‌న స‌రి లేరు నీకెవ్వ‌రు చిత్రంలో న‌టిస్తోంది. ర‌జ‌నీ కాంత్ చిత్రంలోనూ కీల‌క పాత్ర‌లో కీర్తి న‌టించ‌నుంది. ప‌లు క్రేజీ చిత్రాలు కీర్తి ఖాతాలో ఉన్నాయి.
Tags:    

Similar News