'మహానటి' సర్ ప్రైజ్ ట్రీట్.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ..!

Update: 2022-10-24 07:56 GMT
'నేను శైలజ' మూవీతో కీర్తి సురేష్ టాలీవుడ్ కు పరిచయమైంది. ఈ మూవీ సూపర్ హిట్టు కావడంతో ఈ భామకు వరుసగా ఆఫర్లు దక్కాయి. చిన్న, పెద్ద హీరోలనే తేడా లేకుండా కీర్తి సురేష్ కథకే ప్రాధాన్యం ఇస్తోంది. ఈ క్రమంలోనే అలనాటి అందాల తార సావిత్రి బయోగ్రఫీ ఆధారంగా తెరకెక్కిన 'మహానటి'లో నటించే అవకాశం దక్కించుకుంది.

వైజయంతి మూవీస్ బ్యానర్లో నాగ్ అశ్విన్ తెరకెక్కించి 'మహానటి' తెలుగులో ఘన విజయం సాధించింది. ఈ సినిమాలో నటనకు గాను కీర్తి సురేష్ కు జాతీయ ఉత్తమ నటి అవార్డు సైతం దక్కింది. ఈ సినిమా తర్వాత కీర్తి సురేష్ వరుసగా లేడి ఓరియేంటెడ్ మూవీల్లో నటించింది. అయితే అవేమీ ఆమెకు పెద్దగా కలిసి రాలేదు.

ఈ ఏడాది సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి నటించే ఛాన్స్ దక్కించుకుంది. పర్శురాం దర్శకత్వంలో తెరకెక్కిన 'సర్కారువారిపాట' సినిమా కీర్తి సురేష్ కు బ్లాక్ బస్టర్ హిట్టు ఇచ్చింది. ఈ మూవీలో కీర్తి సురేష్ గ్లామర్ షో చేయడం కూడా సినిమాకు ప్లస్ అయ్యింది. ప్రస్తుతం కీర్తి సురేష్ మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం 'బోళాశంకర్', నానితో కలిసి 'దసరా' మూవీలో నటిస్తోంది.

కాగా ఇటీవలే కీర్తి సురేష్ తన పుట్టిన రోజును ఘనంగా జరుపుకుంది. ఈ సందర్భంగా స్టార్ హీరో, హీరోయిన్లు, అభిమానులంతా సోషల్ మీడియాలో ఆమెకు బర్త్ డే విషెస్ తెలిపారు. అక్టోబర్ 17 రోజంతా కీర్తి సురేష్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది. అయితే ఈ భామ తన పుట్టిన రోజు సందర్భంగా అభిమానులతో కొద్దిసేపు సరదా గడిపింది.

చైన్నెలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ కు అభిమానులను పిలిపించుకొని సర్ ప్రైజ్ ట్రీట్ ఇచ్చింది. అనంతరం వారితో కాసేపు ముచ్చటించి సెల్ఫీలు దిగారు. ఈ ఫోటోలను అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవికాస్తా వైరల్ గా మారింది. గతంలో కేవలం హీరోలు మాత్రం ఫ్యాన్స్ ఇలాంటి ట్రీట్ ఇచ్చేవారు.

హీరోయిన్లు ఫ్యాన్స్ పార్టీలు ఇచ్చిన సందర్భాలు పెద్దగా లేవు. అలాంటిది కీర్తి సురేష్ ఒక అడుగు ముందుకేసి అభిమానులకు సర్ ప్రైజ్ ట్రీట్ ఇవ్వడంపై అభిమానులు ఖుషీ అవుతున్నారు. దీనికంటే ముందుగా కీర్తి సురేష్ 'శాంతి వనం' అనే అనాథశ్రమంలోని పిల్లలతో కలిసి తన పుట్టిన రోజును జరుపుకొని కొంత డబ్బు వితరణగా ఇచ్చారు. ఆమె చేసిన పనిపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News