మహానటి చిత్రంతో టాలీవుడ్ కోలీవుడ్ తో పాటు జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కించుకున్న కీర్తి సురేష్ ప్రస్తుతం వరుసగా లేడీ ఓరియంటెడ్ చిత్రాలను చేస్తున్న విషయం తెల్సిందే. ఇప్పటికే ఈమె పెంగ్విన్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ తర్వాత మిస్ ఇండియా ఇంకా గుడ్ లక్ సఖీ చిత్రాలు కూడా రెడీ అవుతున్నాయి. ఈ రెండు సినిమాలు కూడా లేడీ ఓరియంటెడ్ చిత్రాలు అవ్వడంతో పాటు ఓటీటీ విడుదలకు సిద్దం అవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
స్టార్ హీరోలతో పాటు కొందరు చిన్న హీరోలు కూడా తమ సినిమాలు ఓటీటీ విడుదలకు వ్యతిరేకంగా ఉన్నారు. వారు తమ సినిమాలు ఓటీటీలో విడుదల అయితే తమ క్రేజ్ తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కటి ఓటీటీలో విడుదల అయినా థియేటర్లలో తర్వాత విడుదల చేసేందుకు ఛాన్స్ ఉంటుందో లేదో అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అందుకే పలువురు యంగ్ హీరోల సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్నా కూడా ఓటీటీ విడుదలకు మాత్రం ఒప్పుకోవడం లేదు.
థియేటర్లు ఎప్పుడు ఓపెన్ అయితే అప్పుడే రావాలని వారు ఎదురు చూస్తున్నారు. కాని కీర్తి సురేష్ మాత్రం విడుదల విషయంలో పట్టింపు లేకుండా వ్యవహరిస్తున్నట్లుగా ఉంది. అందుకే ఆమె సినిమాలు వరుసగా ఓటీటీ ద్వారా విడుదల అవుతున్నాయి. ఓటీటీలో విడుదల అవ్వడం వల్ల ఈమె క్రేజ్ దెబ్బ తినే ప్రమాదం ఉందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పెంగ్విన్ తో ఓటీటీలో మిశ్రమ స్పందన దక్కించుకున్న కీర్తి సురేష్ మిస్ ఇండియా మరియు గుడ్ లక్ సఖీ విషయంలో ఎలాంంటి ఫలితాన్ని పొందుతుందో చూడాలి.