అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన 'పుష్ప' భారీ వసూళ్లతో కొత్త రికార్డులను నమోదు చేస్తూ వెళుతోంది. టాక్ తో సంబంధం లేకుండా ఈ సినిమా థియేటర్లను దడదడలాడించేస్తోంది. ఈ సినిమాలో ఫాహద్ ఫాజిల్ కనిపిచింది కొంతసేపే. ఇక సునీల్ .. అనసూయ వంటి వారి పాత్రలను పక్కన పెడితే, జగదీశ్ అనే ఆర్టిస్ట్ కి మాత్రం మంచి పేరు వచ్చింది.
వరంగల్ కి చెందిన ఈ కుర్రాడు, 'పలాస' సినిమాలో శ్రీకాకుళం యాసలో అదరగొట్టేశాడు. 'పుష్ప'లో బన్నీతో పాటు 'కేశవ' పాత్రలో సినిమా మొత్తం కనిపిస్తూ చిత్తూరు యాసలో ఇరగదీశాడు. ఎవరబ్బా ఇతగాడు అనుకోని వారు లేరు.
తాజా ఇంటర్వ్యూలో జగదీశ్ మాట్లాడుతూ .. "ఒక స్టార్ తో పనిచేయడం మామూలు విషయం కాదు గదా. బన్నీ సార్ తో కలిసి పనిచేస్తున్నప్పుడు అలాగే అనిపించింది. ఈ సినిమాకి సెలెక్ట్ అయినప్పుడే చాలా ఎగ్జైటింగ్ గా అనిపించింది. ఎప్పటి నుంచో బన్నీ సార్ సినిమాలు చూసుకుంటూ వస్తున్నాను.
సార్ పక్కన యాక్ట్ చేస్తానని నేను ఎప్పుడూ అనుకోలేదు. అలాంటి అవకాశం ఒక్కసారిగా రావడంతో నాలోని ఆనందం నెక్స్ట్ లెవెల్ కి వెళ్లింది. నేను ఈ పాత్రకి ఎంపిక కావడానికి అంతకుముందు నేను చేసిన పాత్రలు ఎంతోకొంత ఉపయోగపడ్డాయి.
గతంలో నేను చేసిన పాత్రలను చూడటం వల్లనే నేను ఏం చేయగలను .. ఎలా చేయగలను అనే విషయాలు సుకుమార్ సార్ కి అర్థమైపోయింది. బన్నీ సార్ తో సినిమా మొత్తం కనిపించే పాత్ర దొరకడం నా అదృష్టం. ఈ సినిమాలో నాతో పాటు స్మగ్లింగ్ గ్యాంగ్ లో నటించిన కుర్రాళ్లంతా నన్ను ఎంతో మెచ్చుకున్నారు.
ఈ సినిమా రిలీజ్ ఆయిన తరువాత మా అమ్మానాన్నలతో .. మిగతా కుటుంబ సభ్యులతో కలిసే ఈ సినిమాను చూశాను. నా పాత్రను చూస్తూ మా అమ్మ నవ్వుతూనే ఉంది .. నేను బాగా చేశానని చెప్పింది. బన్నీ సార్ అంటే మా అమ్మకి చాలా ఇష్టం.
నేను ఇక్కడికి వచ్చి నాలుగేళ్లు దాటింది .. ఇంతవరకూ పెద్దగా సాధించింది లేదు. ఇంటి దగ్గర నా విషయంలో వాళ్లకి కొంచెం టెన్షన్ ఉండేది. ఈ సినిమా తరువాత మా నాన్న కూడా హ్యాపీగానే ఉన్నాడని అనుకుంటున్నాను. నేను ఈ సినిమా చేస్తున్నానని తెలిసినప్పుడు, ఏదో ఒక సీన్ లో కనిపిస్తానని అనుకున్నారేగానీ ఇలా సినిమా మొత్తం ఉంటానని చాలామంది అనుకోలేదు.
ఇప్పుడు ఈ సినిమా చూసి మా ఊళ్లో వాళ్లంతా చాలా షాక్ అవుతున్నారు. మొదటి నుంచి కూడా నాకు సినిమాలంటే చాలా ఇంట్రెస్టు. అదే ఆ తరువాత యాక్టింగ్ వైపు తీసుకొచ్చింది. నన్ను పోలీస్ గా చూడాలని మా నాన్నకు ఉండేది. అందువలన పోలీస్ పాత్ర చేసి ఆయన ముచ్చట తీరుస్తాను" అని చెప్పుకొచ్చాడు.