‘బాహుబలి: ది కంక్లూజన్’ ముందు తర్వాతి రెండు వారాల్లో వచ్చిన కొత్త సినిమాలు నిలబడలేకపోయాయి. కొత్త సినిమాల కంటే కూడా కొన్ని రెట్లు ఎక్కువ వసూళ్లు రాబట్టిందీ సినిమా. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. అమెరికాలో సైతం మే తొలి రెండు వారాల్లో ‘బాహుబలి-2’ హవానే కొనసాగింది. రెండు.. మూడు వారాంతాల్లో సైతం ఈ సినిమా కళ్లు చెదిరే వసూళ్లు రాబట్టింది. ఐతే నాలుగో వీకెండ్లో మాత్రం ‘బాహుబలి-2’ జోరు కొనసాగించలేకపోయింది. చిన్న సినిమా ‘కేశవ’ తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికాలో సైతం ‘బాహుబలి-2’ జోరుకు బ్రేక్ వేయడం విశేషం. ఈ సినిమా ఫస్ట్ వీకెండ్లో వరల్డ్ వైడ్ రూ.11 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేయడం విశేషం.
అమెరికాలో ఈ సినిమా ఫస్ట్ వీకెండ్లో 1.28 కోట్లు వసూలు చేయడం ఆశ్చర్యం కలిగించే విషయమే. గురువారం ప్రివ్యూలతో 55,507 డాలర్లు వసూలు చేసిన ‘కేశవ’.. శుక్రవారం 53,196 డాలర్లు తెచ్చుకుంది. శనివారం వసూళ్లు మరింత పెరిగాయి. 60,226 డాలర్లు వసూలయ్యాయి. ఆదివారం 29,831 డాలర్లతో సరిపెట్టుకుంది ‘కేశవ’. మొత్తంగా ఫస్ట్ వీకెండ్లో ఈ చిత్రం అమెరికాలో దాదాపు రెండు లక్షల డాలర్లు వసూలు చేసింది. ‘కేశవ’ స్థాయికి ఇది పెద్ద మొత్తమే. అందులోనూ ‘బాహుబలి-2’ జైత్రయాత్ర సాగిస్తున్న సమయంలో ఈ చిన్న సినిమా ఈ స్థాయిలో వసూళ్లు రాబడుతుందని అంచనా వేయలేదు. ఫుల్ రన్లో అమెరికాలో ఈ చిత్రం 4 లక్షల డాలర్ల దాకా వసూలు చేసే అవకాశాలున్నాయి.