ఫోటో స్టొరీ: లైవ్ ఖజురహో శిల్పం!

Update: 2019-09-09 01:30 GMT
మన తెలుగు ప్రేక్షకుల్లో ఎక్కువమందికి కేతిక శర్మ పేరు తెలిసి ఉండకపోవచ్చు.  ఈ ఢిల్లీ బ్యూటీ డబ్ స్మాష్ వీడియోస్ ద్వారా సోషల్ మీడియాలో కొంత గుర్తింపు తెచ్చుకుంది. ఈ భామ మోడలింగ్ లో కూడా తన సత్తా చాటుతోంది.  ఈ భామ నటించిన సినిమాలేవీ ఇంకా రిలీజ్ కాలేదు.  పూరి జగన్నాధ్ తనయుడు ఆకాష్ పూరి సినిమా 'రొమాంటిక్' లో హీరోయిన్ గా ఎంపికయింది కానీ ఆ సినిమా షూటింగ్ చాలా రోజుల క్రితమే ఆగిపోయిందని టాక్. మరి షూటింగ్ మళ్ళీ మొదలు పెడతారేమో చూడాలి. .

అసలే కత్తిలాంటి బ్యూటీ.. ఆపై సోషల్ మీడియాలో యాక్టివ్. అందుకే హాట్ ఫోటోషూట్లు చేయడం.. ఆ ఫోటోలను తన ఇన్స్టా ఖాతా ద్వారా పోస్ట్ చేయడం కేతికకు అతి సులభమైన పని.  కానీ ఆ అందాలు చూసి షేక్ కాకుండా ఉండగలిగిన నెటిజన్లు చాలా అరుదుగా ఉంటారు. ఈ సంగతి కేతికకు కూడా తెలిసే ఉంటుంది.  అందుకే తాజాగా ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు "ఫ్రెష్" అంటూ క్యాప్షన్ ఇచ్చింది.  స్లీవ్ లెస్ శాటిన్ గౌన్ లో ఒక స్టూల్ పై కూర్చుంది. డీప్  వీనెక్ ఉండడంతో అందాల విందు జరిగిపోయింది. ఇక థై స్లిట్ ఉండడంతో కాళ్ళ అందాలు బైట పడ్డాయి.  ఖజురహో శిల్పం మనిషిగా మారితే ఎలా ఉంటుందో కేతిక కరెక్ట్ గా అలా ఉంది.  

ఇక ఈ ఇన్స్టా ఖజురహో శిల్పాన్ని చూసి మాయాలో పడిపోని నెటిజన్లు ఉంటారా? పడిపోయారు. వారందరూ లైక్స్ తో కామెంట్స్ తో రెచ్చిపోయారు. "తేరె జైసా కోయి సెక్సీ నహీ".. "చాక్లెట్ ఫ్యాక్టరీలా ఉన్నావు".. "సైక్లోన్ కేతిక"..  "ఎందుకు కేతికా.. ఎందుకిలా" అంటూ తమ హృదయ స్పందనలు తెలిపారు.


Tags:    

Similar News