నాగశౌర్య కథానాయకుడిగా 'లక్ష్య' సినిమా రూపొందింది. ఈ సినిమాతో దర్శకుడిగా సంతోష్ పరిచయమవుతున్నాడు. నారాయణ్ దాస్ నారంగ్ .. రామ్మోహన్ రావు .. శరత్ మరార్ ఈ సినిమాను నిర్మించారు. కాలభైరవ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు.
కేతిక శర్మ కథానాయికగా నటించిన ఈ సినిమాలో, జగపతిబాబు కీలకమైన పాత్రను పోషించాడు. ఈ నెల 10వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ వేదికపై కేతిక మాట్లాడింది.
"ఎలా ఉన్నారు? .. చాలా బాగుంది ఎనర్జీ .. 'లక్ష్య' ఈవెంట్ కి వచ్చినందుకు అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్యూ. ఈ ఈవెంట్ కి చీఫ్ గెస్టుగా వచ్చిన శర్వానంద్ గారికి థ్యాంక్స్ చెబుతున్నాను.
శేఖర్ కమ్ములగారికి నేను చాలా పెద్ద ఫ్యాన్ ని. ఆయన సినిమాలో చేయాలనుంది. గోపీచంద్ గారి వంటి గొప్ప స్పోర్ట్స్ మేన్ స్పోర్ట్స్ కి సంబంధించిన ఈ సినిమాను బ్లెస్ చేయడానికి వచ్చినందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. సంతోష్ గారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆయనకి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
అలాగే నేను ఈ సినిమాను చేయడానికి కారకులైన నిర్మాతలకు థ్యాంక్స్ చెబుతున్నాను. నాగశౌర్య నిజంగా లవ్లీ కోస్టార్. ఆయన చాలా హార్డ్ వర్కర్ .. ఆయనతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. కాలభైరవ గారి ఈ సినిమాకి లవ్లీ మ్యూజిక్ ను అందించారు.
సినిమాటోగ్రఫర్ రామ్ రెడ్డి గారు నన్ను చాలా అందంగా చూపించారు. ఈ సినిమాకి సంబంధించి ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడి పనిచేశారు. వాళ్లందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ సినిమా ఈ నెల 10వ తేదీన విడుదలవుతుంది . అందరూ థియేటర్ కి వెళ్లి చూడండి" అని చెప్పుకొచ్చింది.
సుమ స్టేజ్ పైకి ఒక విల్లు - బాణం తీసుకొచ్చి, ఇష్టం వచ్చిన దిశగా గురి చూసి కొట్టమని కేతిక చేతికి వాటిని అందించింది. స్టేజ్ పై ఇలాంటి అగ్నిపరీక్షలు ఉంటాయని తెలియని కేతిక కాస్త తికమకపడింది.
దాంతో ఆమెకి కాస్త ట్రైనింగ్ ఇవ్వమని సుమ పిలవడంతో నాగశౌర్య స్టేజ్ పైకి వచ్చి, కేతికతో బాణం వేయించాడు. ఆ సమయంలో ఆడిటోరియంలో అంతా ఈలలు .. గోలలు. బాణం నేరుగా వెళ్లి లక్ష్యాన్ని తాకడంతో, ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందని కేతిక చెప్పడం ఆమె సమయస్ఫూర్తికి నిదర్శనం.