టికెట్ హైక్.. RRR లానే KGF 2 కి అనుమ‌తులు?

Update: 2022-04-07 17:30 GMT
మోస్ట్ అవైటెడ్ RRR విడుద‌ల ముందు డైల‌మా గురించి తెలిసిందే. ముఖ్యంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఏరియాకి భారీ ధ‌ర‌లు చెల్లించి బ‌య్య‌ర్లు రైట్స్ కొనుక్కోగా త‌గ్గిన టికెట్ ధ‌ర‌ల వ‌ల్ల సేఫ్ అవ్వ‌డ‌మెలా? అన్న ప్ర‌శ్న త‌లెత్తింది. కానీ ఆర్.ఆర్.ఆర్ ప‌లుమార్లు వాయిదా ప‌డి చివ‌రికి ఏదోలా సుర‌క్షిత‌మ‌న తేదీకి రిలీజైంది. అయితే అదృష్ఠ‌వ‌శాత్తూ అప్ప‌టికి ప‌రిస్థితి మారింది. ఏపీ ముఖ్యమంత్రి జ‌గ‌న్మోహన్ రెడ్డిని క‌లిసి ఆర్.ఆర్.ఆర్ కోసం టికెట్ ధ‌ర‌ల్ని పెంచాల్సిందిగా చిత్ర‌బృందం అభ్య‌ర్థించింది. దానికి జ‌గ‌న్ ప్ర‌భుత్వం అంగీక‌రించింది.

అయితే ఇప్పుడు పొరుగు ప‌రిశ్ర‌మ నుంచి వ‌స్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం కేజీఎఫ్ 2 కోసం జ‌గ‌న్ ప్ర‌భుత్వం టికెట్ ధ‌ర‌ల్ని పెంచుకునే వెసులుబాటు క‌ల్పిస్తుందా? అన్న‌దే డౌట్స్ పుట్టిస్తోంది. ఇది ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమా కాక‌పోయినా కానీ ఇక్క‌డ రేట్లు పెంచుతారా? అంటూ చ‌ర్చ సాగుతోంది. కొత్త జివో లు కొత్త రూల్స్ తో కొన్ని తెలుగు సినిమాలకే స్పెషల్ పర్మిషన్స్ అనుమానాలుండ‌గా కేజీఎఫ్ 2కి అనుమ‌తులిస్తారా? అంటూ చ‌ర్చ సాగుతోంది.

ఎన్ని సందేహాలున్నా కానీ మేక‌ర్స్ త‌మ ప్ర‌య‌త్నం విడువ‌లేదు. కేజీయఫ్ కి టికెట్ పై రూ. 50 పెంచుకునే వెసులుబాటు క‌ల్పించాల్సిందిగా మేక‌ర్స్ ప్ర‌భుత్వాన్ని అభ్య‌ర్థించార‌ని తెలిసింది. ఈనెల 14న కేజీఎఫ్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా అత్యంత భారీగా విడుద‌ల‌వుతోంది. ఈలోగానే టికెట్ పెంపున‌కు అనుమ‌తులు ల‌భిస్తాయేమో చూడాలి. దీనిపై ఇంకా స్ప‌ష్ఠ‌త రావాల్సి ఉంటుంది. టికెట్ పెంపు సాధ్య‌ప‌డితే ఆ మేర‌కు నిర్మాత‌ల‌కు పంట పండిన‌ట్టేన‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సీజన్ లో వ‌స్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రంగా కేజీఎఫ్ 2 పేరు మార్మోగుతోంది.
Tags:    

Similar News