రాకింగ్ స్టార్ యష్ నటించిన `K.G.F- చాప్టర్ 2`కి సెన్సార్ క్లియరైంది. U/A సర్టిఫికేట్ తో CBFC ఆమోదించింది. ముందస్తు బుకింగ్ లు ఏప్రిల్ 7 నుంచి ప్రారంభం కానున్నాయి. 2021-22 మోస్ట్ అవైటెడ్ మూవీగా K.G.F- చాప్టర్ 2 పేరు మార్మోగుతోంది. ఆర్.ఆర్.ఆర్ తర్వాత వస్తున్న అతి భారీ పాన్ ఇండియా చిత్రమిది కావడంతో సౌత్ తో పాటు హిందీ పరిశ్రమలోనూ ఆసక్తి నెలకొంది. రాకింగ్ స్టార్ యష్ తో పాటుగా బాలీవుడ్ ఖల్ నాయక్ సంజయ్ దత్.. రవీనా టాండన్.. శ్రీనిధి శెట్టి ప్రముఖతారాగణం నటిస్తున్న ఈ సినిమాపై హైప్ అంతకంతకు పెరుగుతోంది.
KGF రాకీ భాయ్ తిరిగి బరిలో దిగుతున్నాడు. ఇక దడ పుట్టడం ఖాయం! అన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. ఈ చిత్రం ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా భారీ స్క్రీన్ లలో విడుదల కానుంది. ఇంతలోనే సెన్సార్ బోర్డ్ ఇప్పుడు UA సర్టిఫికేట్ తో చిత్రానికి లైన్ క్లియర్ చేసింది. ఏప్రిల్ 4న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ సినిమాని వీక్షించి భారీ యాక్షన్ కారణంగా సినిమాకు U/A సర్టిఫికేట్ ఇచ్చింది. సినిమా మొత్తం రన్ టైమ్ 168 నిమిషాలు అంటే.. 2 గంటల 48 నిమిషాలు. K.G.F- చాప్టర్ 2 అడ్వాన్స్ బుకింగ్ ఏప్రిల్ 7న థియేట్రికల్ విడుదలకు వారం ముందు ప్రారంభమవుతుంది.
కన్నడ- తెలుగు- హిందీ- తమిళం- మలయాళ భాషల్లో 14 ఏప్రిల్ 2022న అత్యంత భారీగా విడుదలవుతోంది. K.G.F. - చాప్టర్ 2 కి కథను ట్యాలెంటెడ్ ప్రశాంత్ నీల్ రచించి దర్శకత్వం వహించారు. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ నిర్మించారు. ప్రస్తుతం దేశంలోని పాపులర్ నిర్మాణ సంస్థల్లో పాన్-ఇండియా ప్రొడక్షన్ హౌస్ లలో ఒకటైన హోంబలే ఫిల్మ్స్ రానున్న రెండేళ్లలో భారతీయ సినిమాలో కొన్ని అతిపెద్ద చిత్రాలను తెరకెక్కించేందుకు ప్రణాళికలతో సిద్ధంగా ఉంది. ఇందులో ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ `సలార్` కూడా ఉంది.
కేజీఎఫ్ 2 చిత్రాన్ని నార్త్-ఇండియన్ మార్కెట్ లలో రితేష్ సిధ్వాణి- ఫర్హాన్ అక్తర్ కి చెందిన ఎక్సెల్ ఎంటర్ టైన్ మెంట్ - AA ఫిల్మ్స్ అందిస్తున్నాయి. ఎక్సెల్ బ్యానర్ ఇంతకుముందు.. దిల్ చాహ్తా హై- జిందగీ నా మిలేగీ దొబారా- దిల్ ధడక్నే దో - గల్లీ బాయ్ వంటి సూపర్ హిట్ లను అందించింది. కె.జి.ఎఫ్. - చాప్టర్ 2 భారతదేశంలోని అన్ని IMAX స్క్రీన్ లలో కూడా విడుదలవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న IMAX మార్కెట్ లను టార్గెట్ చేయనుంది.