కెజిఎఫ్ హీరో కొత్త ప్రయోగం

Update: 2019-05-13 09:58 GMT
కెజిఎఫ్ తో దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్న యష్ డిమాండ్ మాములుగా లేదు. దాని సీక్వెల్ చాప్టర్ 2కి షూటింగ్ ముందు నుంచే డిమాండ్ ఏర్పడిపోయింది. తాను చేసేవి మాత్రమే కాకుండా చిన్న సినిమాలకు చేయూతనిస్తూ యష్ ఓ కొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టబోతున్నాడు. వివరాల్లోకి వెళ్తే కన్నడలో గిర్మిట్ అనే మూవీ రూపొందుతోంది. అందులో అందరూ చైల్డ్ ఆర్టిస్టులే. కాకపోతే వయసుతో సంబంధం లేకుండా వాళ్ళు పోషించినవి పెద్దవాళ్ళ పాత్రలే.

ఇంకా చెప్పాలంటే జూనియర్ ఎన్టీఆర్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన బాల రామాయణం స్టైల్ లో అన్నమాట. అయితే గిర్మిట్ పక్కా కమర్షియల్ సినిమా. చాలా పరిణితితో కూడిన నటనలో పిల్లలు చేయడం ఇందులో విశేషంగా చెప్పుకుంటున్నారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే హీరో హీరోయిన్లుగా నటించిన చైల్డ్ కపుల్ కు యష్ తో పాటు అతని భార్య కం హీరోయిన్ రాధికా పండిట్ డబ్బింగ్ చెప్పబోతోంది. ఈ సినిమాను తెలుగు హిందీలో పక్కా మాస్ పేరుతో తమిళ్ మళయాలంలో పొడి మాస్ పేరుతో డబ్బింగ్ చేస్తున్నారు.

తెలుగులో ఎవరు గొంతు అరువిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. ఒకపక్క వెంకటేష్ వరుణ్ తేజ్ లాంటి హీరోలు ఇమేజ్ తో సంబంధం లేకుండా ఇతర బాషా సినిమాలకు డబ్బింగ్ చెప్పేందుకు ముందుకు వస్తుంటే ఇప్పుడు యష్ జంట కూడా అదే దారిలో ఉండటం విశేషం. త్వరలోనే ఫస్ట్ లుక్ తో పాటు మిగిలిన వివరాలు తెలియజేయనున్నారు

    
    
    

Tags:    

Similar News