కేజీఎఫ్ నాది కాదు.. స్టేజ్‌పైనే య‌శ్ ఓపెన్ కామెంట్స్‌!

Update: 2022-03-28 05:06 GMT
క‌న్న‌డ హీరో య‌శ్‌, డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన `కేజీఎఫ్ చాప్ట‌ర్ 1' 2018లో విడుద‌లై ఎంత‌టి ఘ‌న విజ‌యం సాధించిందో ప్ర‌త్యేకంగా వివ‌రించాల్సిన ప‌ని లేదు. హోంబాలే ఫిల్మ్ బ్యాన‌ర్‌పై విజయ కిరగందుర్ నిర్మించిన ఈ చిత్రంతోనే య‌శ్ ఓవ‌ర్ నైట్ స్టార్ అవ్వ‌గా.. ప్ర‌శాంత్ నీల్‌కు సైతం పాన్ ఇండియా స్థాయిలో భారీ గుర్తింపు ద‌క్కింది. ఇక ఇప్పుడు చాప్ట‌ర్ 1కు కొన‌సాగింపుగా కేజీఎఫ్ చాప్ట‌ర్ 2 రాబోతోంది.

వాస్త‌వానికి కేజీఎఫ్ 2 షూటింగ్ ఎప్పుడో పూర్తి అయినా.. ప‌లు కార‌ణాల వ‌ల్ల విడుద‌ల‌కు నోచుకోలేదు. అయితే ఇప్పుడు ఈ మూవీని ఏప్రిల్ 14న క‌న్న‌డ‌తో పాటు తెలుగు, త‌మిళ్‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లోనూ అట్ట‌హాసంగా ప్రేక్ష‌కుల ముంద‌కు తీసుకురాబోతున్నారు.

ఈ నేప‌థ్యంలోనే ప్ర‌మోష‌న్స్ షురూ చేసిన మేక‌ర్స్‌.. నిన్న బెంగుళూరులో ట్రైల‌ర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వ‌హించారు.  ఈ ఈవెంట్ కు బాలీవుడ్ ద‌ర్శ‌క‌నిర్మాత క‌ర‌ణ్ జోహార్ హోస్ట్ గా వ్య‌వ‌హ‌రించారు.

గ్రాండ్‌గా జ‌రిగిన ఈ ఈవెంట్‌లో కేజీఎఫ్ క‌న్న‌డ వెర్ష‌న్‌ ట్రైల‌ర్‌ స్టార్‌ హీరో శివ‌రాజ్ కుమార్ చేతుల మీద‌గా బ‌య‌ట‌కు వ‌చ్చింది. తెలుగులో మెగా ప‌వ‌ర్ స్టార్‌ రామ్ చ‌ర‌ణ్‌, హిందీలో బాలీవుడ్ హీరో ఫ‌ర్హాన్ అక్తర్‌, త‌మిళ వెర్ష‌న్‌ను కోలీవుడ్ స్టార్ హీరో సూర్య‌, మ‌ల‌యాళ ట్రైల‌ర్‌ను పృథ్విరాజ్ సుకుమారన్ విడుదల చేయ‌గా.. అన్ని భాష‌ల్లోనూ విశేష స్పంద‌న ల‌భించింది.

ఇక‌పోతే ట్రైల‌ర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో య‌శ్ కేజీఎఫ్ సినిమా నాది కాదంటూ ఆస‌క్తిక‌ర‌ కామెంట్స్ చేశారు. మొద‌ట కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్‌కి నివాళులు అర్పించిన య‌శ్‌.. ఆపై మాట్లాడుతూ `మా 8 ఏళ్ల‌ కష్టమే ఈ సినిమా. దీని కోసం లైట్ మ్యాన్ దగ్గర నుంచి ప్రొడక్షన్ బాయ్ వరకు అందరూ ఎంతో శ్ర‌మించారు. వారందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.

అయితే సినిమా చూసిన త‌ర్వాత ప్రతి ఒక్కరూ ఆ క్రెడిట్ నాకే ఇస్తున్నారు. అది సరికాదు. అస‌లు ఈ చిత్రం నాది కాదు.. ప్రశాంత్ నీల్ సినిమా. ఆ క్రెడిట్ అంతా కేవలం ప్రశాంత్ నీల్‌కే చెందాలి. కేవలం అతని వల్లే ఇది సాధ్యమైంది. నేను ఈ సినిమాలో న‌టించినందుకు చాలా ఆనందంగా ఉంది. కేజీఎఫ్ కన్నడ చిత్ర సీమ‌కే గర్వకారణం.` అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో ఇప్పుడీయ‌న కామెంట్స్ నెట్టింట వైర‌ల్‌గా మారాయి.
Tags:    

Similar News