ఎన్నో అంచనాలతో భారీ సినిమాల విడుదలతో ఊరించిన డిసెంబర్ 21 తెలుగు స్ట్రెయిట్ మూవీస్ కి మాత్రం షాక్ ఇచ్చింది. ముఖ్యంగా యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఎంతో నమ్మకం పెట్టుకున్న పడి పడి లేచే మనసు తీవ్రంగా నిరాశ పరచడం ఎవరూ ఊహించనిది. షారుఖ్ ఖాన్ జీరోతో సహా మొత్తం ఐదు సినిమాలు బరిలో నిలిచి దేనికీ పాజిటివ్ టాక్ రాకపోవడం ఆశ్చర్యం కలిగించినా ఉన్నంతలో కెజిఎఫ్ బెటర్ టాక్ తో వసూళ్లు రాబడుతుండటం విశేషం. నిజానికి కన్నడ డబ్బింగ్ సినిమాలు తెలుగులో గత రెండు దశాబ్దాల్లో ఎన్నడూ పెద్దగా ఆడిన దాఖలాలు లేవు. వచ్చిన ఒకటి రెండూ కూడా ప్రేక్షకులు గుర్తించే లోపే వెళ్లిపోయాయి.
అయితే కెజిఎఫ్ ఈ ట్రెండ్ ని బ్రేక్ చేసింది. డివైడ్ టాక్ వచ్చినప్పటికీ కంటెంట్ పరంగా గొప్పగా లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నప్పటికీ మాస్ కి దీన్ని మించిన ఛాయస్ లేకపోవడంతో ఓట్లన్నీ కెజిఎఫ్ లో రాకీ భాయ్ కె పడుతున్నాయి. నిన్న ఆదివారం హౌస్ ఫుల్స్ ఎక్కువగా రికార్డ్ అయిన మూవీస్ లో కెజిఎఫ్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. అనూహ్యంగా దీని తర్వాత ప్లేస్ కోసం గత వారం విడుదలైన హుషారు పోటీ పడుతుండటం విశేషం. క్రాస్ రోడ్స్ లో సండే షోస్ ఎక్కువగా నిండింది ఈ రెండింటికకే.
అయితే మరి వరుణ్ తేజ్ అంతరిక్షం ఏమైంది అనే డౌట్ వస్తుంది కదా. స్పేస్ థ్రిల్లర్ అయినప్పటికీ సామాన్య ప్రేక్షకులను బోర్ కొట్టించకుండా పూర్తి స్థాయిలో మెప్పించడంలో అంతగా సక్సెస్ కాలేకపోవడంతో దీని కలెక్షన్స్ మందకొడిగానే ఉన్నాయి. నిన్న చాలా నయం. ఈ రోజు నుంచి డ్రాప్ చాలా ఎక్కువగా ఉంటుందని ట్రేడ్ రిపోర్ట్స్ ఉన్నాయి. ఏదైతేనేం ఉన్నవాటిలో ఏది బెటర్ అనే యాంగిల్ లో కెజిఎఫ్ అడ్వాంటేజ్ తీసుకుంటోంది.