ప్రభాస్.. యశ్‌ కాంబో కోసం అప్పటి వరకు ఆగనక్కర్లేదట!

Update: 2022-07-20 00:30 GMT
యంగ్‌ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న సలార్ సినిమా చిత్రీకరణ ఇప్పటికే పూర్తి అవ్వాల్సి ఉన్నా సినిమా భారీతనం ను భారీగా పెంచుతున్న నేపథ్యంలో ఆలస్యం అవుతుంది. హీరోగా ప్రభాస్ కు ఈ సినిమా అత్యంత కీలకం. ఇక కేజీఎఫ్ 2 తో వెయ్యి కోట్లకు పైగా దక్కించుకున్న ప్రశాంత్‌ నీల్ పై కూడా ప్రేక్షకులు అంచనాలు భారీగా పెంచుకున్నారు.

అందుకే సలార్ సినిమా విషయంలో తగ్గేదేలే అన్నట్లుగా మేకర్స్ వ్యవహరిస్తున్నారట. బాలీవుడ్‌ స్టార్‌ కాస్టింగ్‌ తో పాటు హాలీవుడ్‌ టెక్నాలజీ.. టెక్నికల్ టీమ్ ను ఉపయోగిస్తున్న యూనిట్‌ సభ్యులు సినిమాకు మరింత హైప్ తీసుకు వచ్చేందుకు కొన్ని మ్యాజిక్‌ లు కొన్ని మెరుపులు సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

అందులో ముఖ్యమైన మెరుపు కేజీఎఫ్‌ స్టార్‌ యశ్‌.. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రముఖంగా చర్చ జరుగుతోంది. కేజీఎఫ్‌ స్టార్‌ యశ్‌ ను సలార్‌ లో నటింపజేసేందుకు దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ మూడు నాలుగు నిమిషాల చిన్న పాత్రను క్రియేట్‌ చేశాడని.. కేజీఎఫ్ ఇచ్చిన విశ్వాసంతో యశ్‌ కూడా సలార్ లో చేసేందుకు సిద్ధం అయ్యాడని అంటున్నారు.

మొన్నటి వరకు సలార్‌ తర్వాత ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ఒక భారీ కేజీఎఫ్‌.. సలార్‌ కాంబో మూవీ రాబోతుంది. రెండు పాత్రలతో ఒక కథను అల్లి అద్బుతమైన హాలీవుడ్‌ రేంజ్ యాక్షన్‌ సిరీస్ ను రూపొందించేందుకు దర్శకుడు ప్లాన్‌ చేస్తున్నాడు అంటూ హంబుల్‌ నిర్మాణ సంస్థకు చెందిన వారు అన్నారు.

అయితే అందుకు కొన్ని సంవత్సరాల సమయం పట్టే అవకాశం ఉందని అంతా భావించారు. కానీ తాజా పుకార్లతో యశ్ మరియు ప్రభాస్ ల కలయిక సినిమా కోసం ఎన్నో సంవత్సరాలు.. ఎంతో కాలం వెయిట్‌ చేయనక్కర్లేదు. వచ్చే ఏడాది సలార్‌ సినిమా తోనే వీరిద్దరిని కలిపి చూడాలని కోరుకుంటున్న అభిమానులకు కోరిక తీరబోతుందనే అభిప్రాయం ను కొందరు వ్యక్తం చేస్తున్నారు.

మొత్తానికి సలార్‌ సినిమా లో కేజీఎఫ్ స్టార్‌ యశ్‌ నటిస్తాడు అనే వార్తలతోనే అంచనాలు ఆకాశాన్ని తాకేలా వస్తున్నాయి. కనుక దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ సినిమా మార్కెట్‌ ను.. బజ్‌ ను పెంచేందుకు అయినా యశ్‌ ను నటింపజేయాలని ప్రభాస్‌ అభిమానులు మరియు సినీ ప్రేమికులు కోరుకుంటున్నారు. మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అయ్యేది చూడాలి.
Tags:    

Similar News