60 ప్లస్ లోనూ మెగాస్టార్ జోరు చూస్తుంటే అన్ స్టాపబుల్ అన్న తీరుగానే ఉంది. ప్రస్తుతం ఆయన కొరటాలతో ఆచార్య చిత్రాన్ని వేగంగా పూర్తి చేయాలని ఎంతో కసిగా వేచి చూస్తున్నారట. ఇది పూర్తయ్యే లోపే మరో రెండు ప్రాజెక్టుల్ని ఖాయంగా సెట్స్ పై ఉంచాలన్న ప్రణాళికతో దూసుకెళుతున్నారు. వీటిలో లూసీఫర్ రీమేక్ వినాయక్ తో ..వేదాళం రీమేక్ మెహర్ రమేష్ తో ఖాయం చేశారు.
ఈ రెండిలో వేదాళం రీమేక్ తొలిగా సెట్స్ పైకి వెళుతుందని ప్రచారమవుతోంది. అంతేకాదు... మెహర్ రమేష్ ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేయడంలో బిజీగా ఉన్నారు. ప్రాజెక్ట్ ఖాయం చేసే ముందే మెహర్ రమేష్ కి చుక్కలు చూపించారన్న టాక్ కూడా ఉంది. ఇక వేదాళం రీమేక్ లో సాయి పల్లవి మెగాస్టార్ సోదరి పాత్రను పోషిస్తున్నట్లు గుసగుసలు వేడెక్కించేస్తున్నాయ్.
అలాగే మరో కీలకమైన అప్ డేట్ కూడా అందింది. వేదాళం భారీ యాక్షన్ మూవీ కాబట్టి స్టంట్ కొరియోగ్రాఫర్ ని ఏరికోరి ఎంపిక చేసుకుంటున్నారు. కేజీఎఫ్ చిత్రానికి స్టంట్స్ కొరియోగ్రాఫ్ చేసిన మాస్టర్ ద్వయం అన్బరివ్ (అన్బు, అరివు) వేదాళం రీమేక్ కోసం బరిలోకి రానున్నారు. కేజీఎఫ్ కు జాతీయ అవార్డును గెలుచుకున్న వీరిద్దరూ మెహర్ రమేష్ తో పాటు చిరంజీవిని కలుసుకున్నారని తెలుస్తోంది. మహతి స్వరా సాగర్ వేదలం రీమేక్ కోసం ఒక పాటను రికార్డ్ చేసారని వెల్లడైంది.