RRR వ‌ర్సెస్ KGF-2 .. ఎవ‌రికి ఆ డేట్?

Update: 2020-02-05 08:58 GMT
2020 ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ మూవీస్ RRR ..కేజీఎఫ్‌-2 చిత్రాలు పాన్ ఇండియా కేట‌గిరిలో రిలీజ్ కి సిద్ధ‌మ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ జూలై 31 అంటూ ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి ప్ర‌క‌టించారు. బాహుబ‌లి సెంటిమెంట్ ని రిపీట్ చేయాల‌న్న పంతంతో ఉన్నారు. బాహుబ‌లి అదే నెల 10న రిలీజై పాన్ ఇండియా కేట‌గిరీలో సంచ‌ల‌న విజ‌యం అందుకుంది కాబ‌ట్టి అదే ఇప్పుడు రిపీట‌వుతుందన్న హోప్ తో ఉన్నారు. సెంటిమెంటును బ‌లంగా జ‌నంలోకి తీసుకెళ్ల‌డ‌మే ధ్యేయంగా జ‌క్క‌న్న తెలివిగా ఆ తేదీని లాక్ చేసారు. ఆ మేర‌కు షూటింగ్ స‌హా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులను పూర్తిచేసి ప్ర‌క‌టించిన తేదీకే రిలీజ్ చేయాల‌ని సంక‌ల్పించారు.

అయితే ఇంత‌లోనే ఊహించ‌ని ట్విస్టు. గ్రాఫిక్స్ స‌హా ఇత‌ర ప‌నులు వేగంగా పూర్త‌వుతాయా? అన్న సందిగ్ధ‌త ఇటీవ‌ల వ్య‌క్త‌మైంది. RRR చిత్రీక‌ర‌ణ ప్రారంభంలోనే ఎన్టీఆర్- రామ్ చ‌ర‌ణ్ ఒక‌రి త‌ర్వాత ఒక‌రిగా గాయాలు పాల‌వ్వ‌డంతో షూటింగ్ అనుకున్న ప్ర‌కారం జ‌ర‌గ‌లేదు. దీంతో ఆర్.ఆర్.ఆర్ చిత్రీక‌ర‌ణ ఆల‌స్య‌మై.. ముందే ప్ర‌క‌టించిన తేదీకి వ‌చ్చే అవ‌కాశాలు లేవ‌న్న ప్ర‌చారం సాగింది. ఈ నేప‌థ్యంలో యూనిట్ 2021 సంక్రాతి ని టార్గెట్ చేసిన‌ట్లు ప్ర‌చారం సాగుతోంది. సంక్రాంతి రిలీజ్ అయితే కావాల్సినంత‌ టైమ్ దొరుకుతుంది. బెస్ట్ ఔట్ పుట్ తీసుకు రావొచ్చు అన్న ఉద్దేశం తో జ‌క్క‌న్న ఆ దిశ‌గా అడుగులు వేస్తున్నట్లు యూనిట్ వ‌ర్గాల నుంచి లీకైంది. దీంతో జూలై 30 ఖాళీ అవుతున్న‌ట్లే. ఈ నేప‌థ్యంలో అదే తేదీకి కేజీఎఫ్ చాప్ట‌ర్-2ని రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.

వాస్త‌వానికి ఈ చిత్రాన్ని ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ అక్టోబ‌ర్ లేదా డిసెంబ‌ర్ లో రిలీజ్ చేయాల‌ని అనుకున్నారు. కానీ ఆర్.ఆర్.ఆర్ రేసు నుంచి ఎగ్జిట్ అవ్వ‌డంతో ఎట్టి ప‌రిస్థితిల్లో ఆ తేదీకే త‌మ సినిమాను రిలీజ్ చేసుకుంటే బాగుంటుంద‌ని భావిస్తున్నార‌ట‌. అందుకు త‌గ్గ‌ట్టే వీలైనంత త్వ‌ర‌గా షూటింగ్ పూర్తిచేసి కేజీఎఫ్‌-2 ని రిలీజ్ చేయాల‌ని ప‌నుల్ని వేగ‌వంతం చేశార‌ట‌. ఇప్ప‌టికే కేజీఎఫ్‌-2 ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ అంచ‌నాల‌ను పెంచేసింది. అధీరా (ద‌త్) లుక్ కి చ‌క్క‌ని స్పంద‌న ల‌భించింది. దీంతో టీజ‌ర్ కోసం ఫ్యాన్స్ అంతా ఎంతో ఎగ్జ‌యిటింగ్ గా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఆర్.ఆర్.ఆర్ స్థానంలో కేజీఎఫ్‌-2 రిలీజవుతోంది అన్న ప్ర‌చారం ఫ్యాన్స్ వేడెక్కిస్తుంది. తొలి భాగాన్ని మించిన భారీ యాక్ష‌న్ తో వ‌స్తున్న ఈ సినిమా పై మార్కెట్ వ‌ర్గాల్లోనూ ఆస‌క్తి నెల‌కొన్న సంగ‌తి తెలిసిందే.
Tags:    

Similar News