హిందీ బాక్సాఫీస్ వ‌ద్ద కేజీఎఫ్ 2 స్థాన‌మిదే

Update: 2022-04-20 06:30 GMT
వ‌రుస‌గా సౌత్ నుంచి పాన్ ఇండియా సినిమాలు స‌త్తా చాటుతున్నాయి. పుష్ప - ఆర్.ఆర్.ఆర్ త‌ర్వాత కేజీఎఫ్ 2 సంచ‌ల‌న విజ‌యం సాధించింది. ముఖ్యంగా ఈ సినిమాల‌న్నీ హిందీ బాక్సాఫీస్ వ‌ద్ద 100కోట్ల క్ల‌బ్ లో చేరాయి. హిందీలో ఆర్.ఆర్.ఆర్ త‌ర్వాత‌ కేజీఎఫ్ 2 ఏకంగా 200 కోట్ల క్ల‌బ్ లో చేరింది. ఈ సినిమా ఇప్ప‌టికే ఉత్త‌రాది బాక్సాఫీస్ నుంచి 220 కోట్లు వ‌సూలు చేసింది.

క్లబ్ వైజ్ డేటా ర్యాంకుల‌ను ప‌రిశీలిస్తే.. 200 కోట్ల క్ల‌బ్ లో టాప్ 20 సినిమాల వివ‌రాలు ఇలా ఉన్నాయి.

ర్యాంక్ -సినిమా పేరు- విడుదల తేదీ- జీవితకాల వసూళ్లు (కోట్లు)- ఎన్ని రోజుల్లో..  200 కోట్లకు చేరాయి అన్న‌ది ఆర్డ‌ర్ ప్ర‌కారం ప‌రిశీలిస్తే.. డేటా ఇలా ఉంది. అయితే ఈ జాబితాలో టాప్ 1 పొజిష‌న్ లో ఇప్ప‌టికీ బాహుబ‌లి 2 కొన‌సాగుతుండ‌గా .. రెండో స్థానంలో దంగ‌ల్ నిలిచింది.

1. బాహుబలి 2 - ముగింపు 28 ఏప్రిల్-2017  - 510.99- 7 రోజులు
2. దంగల్ 23-డిసెంబర్-2016 - 387.38 - 8 రోజులు
3. సంజు 29-జూన్-2018 - 342.53 - 7 రోజులు
4.PK 19-డిసెంబర్-2014 - 340.8 - 9 రోజులు
5. టైగర్ జిందా హై 22-డిసెంబర్-2017- 339.16- 7 రోజులు
6. బజరంగీ భాయిజాన్ 17-జూలై-2015- 320.34- 9 రోజులు
7. వార్  02అక్టోబర్-2019- 317.91 -7 రోజులు
8. పద్మావత్ 25-జనవరి-2018 -302.15- 11 రోజులు
9. సుల్తాన్  06 జూలై-2016 - 300.45- 7 రోజులు
10. ధూమ్ 3.. 20 డిసెంబర్-2013 - 284.27 - 9 రోజులు
11 తాన్హాజీ - ది అన్‌సంగ్ వారియర్ 10-జనవరి-2020 -279.55 -15 రోజులు
12 కబీర్ సింగ్ 21-జూన్-2019 -278.24 -13  రోజులు
13 RRR 25-మార్చి-2022- 255.04 - 13 రోజులు
14 కాశ్మీర్ ఫైల్స్ 11-మార్చి-2022 - 251.75 - 13 రోజులు
15 ఉరి - ది సర్జికల్ స్ట్రైక్ - 11 జనవరి 2019 - 245.36 - 29 రోజులు
16 క్రిష్ 3 - 01 నవంబర్-2013 - 244.92 - 10 రోజులు
17 సింబా  .. 28డిసెంబర్ 2018 - 240.31 -12 రోజులు
18 కిక్ 25-జూలై-2014 - 231.85 - 11 రోజులు
19 చెన్నై ఎక్స్‌ప్రెస్ 09ఆగస్ట్ 2013 - 227.13 -15 రోజులు
20K.G.F-చాప్టర్ 2 14-ఏప్రిల్ 2022 -219.56 కోట్లు- 5 రోజుల్లో (ఇప్ప‌టికీ ఘ‌నంగా ఆడుతోంది) (రికార్డులు చాలా మెరుగ‌య్యే ఛాన్సుంది)
21 భారత్ 05 జూన్ 2019 - 211.07 - 14 రోజులు
22 ప్రేమ్ రతన్ ధన్ పాయో 12 నవంబర్ 2015-210.16- 14 రోజులు
23 గోల్‌మాల్ ఎగైన్ 20 అక్టోబర్ 2017 -205.69 - 24 రోజులు
24 గుడ్ న్యూజ్ 27 డిసెంబర్ 2019 - 205.14 - 24 రోజులు
25 హ్యాపీ న్యూ ఇయ‌ర్ 24-అక్టోబర్-2014 -203 -19 రోజులు
26 మిషన్ మంగళ్ 15-ఆగస్టు 2019 - 202.98 - 29 రోజులు
27 3 ఇడియట్స్ .. 25-డిసెంబర్-2009 - 202.95 కోట్లు- 110 రోజుల్లో వ‌సూలైంది.

ఈ జాబితాలో ఆర్.ఆర్.ఆర్ - కేజీఎఫ్ 2 చిత్రాలు భారీ క్రైసిస్ అనంత‌రం రిలీజైన స‌నిమాలు. కంటెంట్ ఉంటే సీన్ ఎలా ఉన్నా జ‌నం ఆద‌రిస్తార‌న‌డానికి ఎగ్జాంపుల్స్ ఇవి. బాలీవుడ్ స‌హా అన్ని ప‌రిశ్ర‌మ‌ల‌కు క‌రోనాక్రైసిస్ అనంత‌రం చుక్కానీలా దారి చూపాయ‌ని ప్ర‌శంస‌లు అందుకుంటున్నాయి. మునుముందు కేజీఎఫ్ 2 ఈ జాబితాలో టాప్ 10లోకి వ‌స్తుందేమో చూడాలి.
Tags:    

Similar News