జూన్‌ లో సెకండ్ వేవ్‌ క్లీయర్‌ పై నమ్మకంగా ఉన్న కేజీఎఫ్‌

Update: 2021-06-01 03:07 GMT
కన్నడ స్టార్‌ హీరో యశ్‌ 'కేజీఎఫ్‌' సెన్షేషనల్ సక్సెస్ అయిన నేపథ్యంలో కేజీఎఫ్ 2 పై అంచనాలు ఆకాశమే హద్దు అన్నట్లుగా ఉన్నాయి. ఇప్పటికే షూటింగ్‌ ను ముగించి విడుదలకు కూడా దర్శకుడు ప్రశాంత్ నీల్‌ రెడీ చేశాడు. గత ఏడాది విడుదల అవ్వాల్సి ఉన్నా కూడా కరోనా కారణంగా వాయిదా వేశారు. ఈ ఏడాది జులైలో సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా ఆమద్య అధికారికంగా తేదీ ఇచ్చి మరీ ప్రకటించారు. కరోనా సెకండ్ వేవ్‌ కారణంగా సినిమా షూటింగ్ లన్నీ నిలిచి పోవడంతో ఏప్రిల్‌ నుండి మొదలుకుని దసరా సీజన్‌ లో విడుదల అవ్వాల్సిన సినిమాల వరకు ప్రభావం పడింది.
 
సెకండ్‌ వేవ్‌ కేజీఎఫ్ 2 పై కూడా ప్రభావం చూపించడం ఖాయం.. విడుదల వాయిదా పడటం ఖాయం అనుకుంటున్న సమయంలో చిత్ర యూనిట్‌ సభ్యులు కొత్తగా విడుదల చేసిన ఒక పోస్టర్ లో సినిమాను అనుకున్న సమయానికి అంటే జులై 16న విడుదల చేసి తీరుతాం అన్నట్లుగా మరోసారి ప్రకటించారు. సినిమా షూటింగ్‌ బ్యాలన్స్ లేకపోవడంతో పాటు నిర్మాణానంతర కార్యక్రమాలు కూడా ముగియడం వల్ల సినిమాను మరింత ఆలస్యం చేయాలని వారు భావించడం లేదు. కేజీఎఫ్ 2 కు ఉన్న బజ్ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా భారీగా విడుదల చేయబోతున్నారు.

ప్రభుత్వ వర్గాలతో పాటు వైధ్యులు అంతా కూడా జూన్‌ చివరి వరకు సెకండ్ వేవ్‌ ప్రభావం పూర్తిగా తగ్గుతుందనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు. అదే నమ్మకంను కేజీఎఫ్ టీమ్ కూడా కలిగి ఉందేమో అందుకే జులై లో సినిమాను విడుదల చేయాలనే పట్టుదలతో ఉన్నట్లుగా అనిపిస్తుంది. చివరి నిమిషం వరకు వెయిట్‌ చేసి ఆ తర్వాత పరిస్థితులు అనుకూలించకుంటే అప్పుడు విడుదల వాయిదా వేయాలనే ఉద్దేశ్యంతో కేజీఎఫ్ మేకర్స్ ఉన్నారు. నెలన్నర రోజుల్లో ఏమైనా జరగవచ్చు అనేది వారి అభిప్రాయంగా కనిపిస్తుంది. దేశ వ్యాప్తంగా కేజీఎఫ్ ప్రియులు ఛాప్టర్ 2 కోసం వెయిట్‌ చేస్తున్నారు. మరి ఎంతరకు సినిమా వచ్చేనో చూడాలి.
Tags:    

Similar News