దేశవ్యాప్తంగా యావత్ సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ''కేజీయఫ్ - 2''. కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. వీరి కాంబోలో సంచలన విజయం సాధించిన ‘కేజీయఫ్ ఛాప్టర్ 1’ చిత్రానికి కొనసాగింపుగా ఇది రూపొందుతోంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి ఆదరణ తెచ్చుకుంది. ముఖ్యంగా యష్ పుట్టిన రోజు సందర్భంగా జనవరి 7న రిలీజ్ చేసిన 'కేజీఎఫ్ ఛాప్టర్-2' టీజర్ రికార్డు స్థాయిలో వ్యూస్ దక్కించుకుంది. ఈ క్రమంలో తాజా ఈ టీజర్ సరికొత్త రికార్డ్ నమోదు చేసింది.
యూట్యూబ్ లో అతి తక్కువ రోజుల్లో అత్యధిక కామెంట్లు పొందిన తొలి శాండిల్ వుడ్ టీజర్ గా 'కేజీయఫ్ - 2' టీజర్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. 1 మిలియన్ (10 లక్షలు) పైగా కామెంట్స్ రాబట్టిన ఈ టీజర్.. ఈ రికార్డ్ నమోదు చేసిన నాల్గవ ఇండియన్ టీజర్ గా నిలిచింది. ఇప్పటి వరకు ఈ టీజర్ 188 మిలియన్స్ కి పైగా వ్యూస్.. 8 మిలియన్లకి పైగా లైక్స్ సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని మేకర్స్ ట్విటర్ వేదికగా వెల్లడించారు.
కాగా, పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న 'కేజీఎఫ్ 2' చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ప్రతినాయకుడు ‘అధీరా’ పాత్రలో నటిస్తున్నారు. ఇందులో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా.. బాలీవుడ్ నటి రవీనా టాండన్ కీలక పాత్ర పోషించారు. ప్రకాష్ రాజ్ - రావు రమేష్ - ఈశ్వరీ రావు తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి రవి బర్సూర్ సంగీతం సమకూరుస్తున్నారు. హోంబలే ఫిలింస్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.