ఈమద్య కాలంలో సౌత్ సినిమాలు హద్దులను చెరిపేసి పాన్ ఇండియా సినిమాలుగా దూసుకు పోతున్నాయి. ప్రస్తుతం సౌత్ లో రూపొందుతున్న ఆర్ ఆర్ ఆర్.. కేజీఎఫ్ 2 మరియు పుష్ప సినిమా ల కోసం ఉత్తరాది ప్రేక్షకులతో పాటు అన్ని భాషల ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్నారు. పాన్ ఇండియా సినిమాలుగా సౌత్ లో రూపొందుతున్న అతి పెద్ద సినిమాలు అయిన కేజీఎఫ్ 2 మరియు పుష్ప సినిమాల విడుదల విషయంలో ప్రస్తుతం ఆసక్తి నెలకొంది. కరోనా సెకండ్ వేవ్ కు ముందు ఈ సినిమాలు నెల రోజుల గ్యాప్ తో విడుదల చేసేందుకు అధికారికంగా తేదీలను ప్రకటించారు.
కేజీఎఫ్ 2 ను జులై లో పుష్ప ను ఆగస్టులో విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించిన కొన్ని రోజుల్లోనే కరోనా వల్ల షూటింగ్స్ ఆగిపోవడం.. థియేటర్లు మూత పడటంతో విడుదల తేదీలు మార్చాల్సి వచ్చింది. కేజీఎఫ్ 2 సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదల తేదీకి సిద్దంగా ఉంది. ఇక పుష్ప సినిమా చివరి దశ చిత్రీకరణ లో ఉంది. ఈ రెండు సినిమాల విడుదల తేదీల విషయం ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. కేజీఎఫ్ ను మొదట అక్టోబర్ లో అంటూ ప్రచారం జరిగింది. కాని అప్పటి వరకు థియేటర్లు పూర్తి స్థాయిలో ఓపెన్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. దాంతో డిసెంబర్ లో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారట.
కేజీఎఫ్ మొదటి పార్ట్ డిసెంబర్ లోనే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా క్రిస్మస్ కానుకగా వచ్చి సక్సెస్ అయ్యింది కనుక రెండవ పార్ట్ ను కూడా డిసెంబర్ లో విడుదల చేస్తే సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందనే నమ్మకంతో మేకర్స్ ఉన్నారట. అతి త్వరలోనే ఈ సినిమా క్రిస్మస్ కానుకగా విడుదల కాబోతుంది అంటూ తేదీని ప్రకటిస్తారని తెలుస్తోంది. మరో వైపు క్రిస్మస్ కు పుష్ప మొదటి పార్ట్ ను కూడా విడుదల చేసే యోచనలో ఉన్నారట. ఆగస్టులో విడుదల అవ్వాల్సిన సినిమా ను దసరాకు విడుదల చేయాలనుకున్నా అప్పటి వరకు షూటింగ్ పూర్తి అయ్యే అవకాశాలు లేవు.. అలాగే థియేటర్లు పూర్తి స్థాయిలో రన్ అవుతాయో లేదో క్లారిటీ లేదు.
సెప్టెంబర్ మరియు అక్టోబర్ ఇంకా నవంబర్ లో థర్డ్ వేవ్ అంటూ ప్రచారం జరుగుతుంది. కనుక ఆ సమయంలో సినిమాను విడుదల చేయడం కంటే క్రిస్మస్ వరకు వేచి చూడాలనే నిర్ణయానికి వచ్చారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఇప్పటికే పలు సినిమాలు సిద్దంగా ఉన్నాయి కనుక ఈ రెండు సినిమాలను డిసెంబర్ లో విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. క్రిస్మస్ కు వచ్చే సెలవులకు ఈ సినిమాను విడుదల చేయడం ద్వారా క్యాష్ చేసుకోవాలని భావిస్తున్నారు. ఈ రెండు సినిమాలకు కూడా విపరీతమైన బజ్ ఉంది. ఇలాంటి సమయంలో ఒకేసారి రెండు సినిమాలు విడుదల అయితే పరిస్థితి ఏంటీ అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో ఇప్పటి నుండే చర్చ మొదలు అయ్యింది.
రెండు సినిమాలు వారం పది రోజుల గ్యాప్ లో విడుదల అయినా కూడా కలెక్షన్స్ పై ప్రభావం ఉంటుంది. కనుక కనీసం రెండు వారాల గ్యాప్ లో వస్తే తప్ప రెండు సినిమాలకు వసూళ్ల విషయంలో కాస్త ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాని రెండు సినిమాలు కూడా క్రిస్మస్ కానుకగానే విడుదల చేయాలని భావిస్తున్నారు. అంటే రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద హోరా హోరీ తప్పదు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారి టాక్.
పుష్ప సినిమా ఒక్కటే పది కేజీఎఫ్ లతో సమానం అంటూ ఆమద్య సుకుమార్ శిష్యుడు అయిన దర్శకుడు బుచ్చి బాబు వ్యాఖ్యలు చేశాడు. అలాంటిది పుష్ప మరియు కేజీఎఫ్ 2 లు పోటీ పడబోతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఒక రకమైన యుద్ద వాతావరణం బాక్సాఫీస్ వద్ద కనిపించడం ఖాయం అంటున్నారు. మరి ఇండస్ట్రీ పెద్దలు ఈ బాక్సాఫీస్ వార్ ను అడ్డుకునేందుకు ఏమైనా ప్రయత్నం చేస్తారా అనేది చూడాలి.