చిరంజీవి చితగ్గొట్టేశాడుగా..

Update: 2017-01-16 10:58 GMT
పదేళ్లు విరామం తీసుకున్నా తన బాక్సాఫీస్ స్టామినా ఏమీ తగ్గలేదని రుజువు చేస్తున్నాడు మెగాస్టార్ చిరంజీవి. తొలి రోజు వసూళ్లతోనే ప్రకంపనలు రేపిన చిరు సినిమా ‘ఖైదీ నెంబర్ 150’.. ఆ తర్వాత కూడా అదే జోరు చూపించింది. తొలి వారాంతంలో తెలుగు రాష్ట్రాల వరకే ఏకంగా రూ.47 కోట్ల షేర్ వసూలు చేసి.. సంచలనం సృష్టించింది. ఇది నాన్-బాహుబలి రికార్డు కావడం విశేషం. తొలి వీకెండ్లో ‘ఖైదీ నెంబర్ 150’ ఏరియాల వారీగా బ్రేకప్స్ చూస్తే..

చిరంజీవికి తిరుగులేని ఫాలోయింగ్ ఉన్న నైజాం ఏరియాలో ‘ఖైదీ నెంబర్ 150’ రూ.13.1 కోట్ల షేర్ వసూలు చేయడం విశేషం. సీడెడ్లో రూ.8.58 కోట్లు వచ్చాయి. నెల్లూరులో రూ.2.04 కోట్లలో సంచలనం సృష్టించింది చిరు సినిమా. గుంటూరులో రూ.4.65 కోట్లు.. కృష్ణాలో రూ.3.34 కోట్లు.. తూర్పు గోదావరిలో రూ.5.32 కోట్లు.. పశ్చిమగోదావరిలో 4.19 కోట్లు.. ఉత్తరాంధ్రలో రూ.5.75 కోట్లతో ఎక్కడికక్కడ నాన్ బాహుబలి ఫస్ట్ వీక్ షేర్స్ రికార్డుల్ని బద్దలుకొట్టేసింది చిరు సినిమా.

అమెరికాలో ఇప్పటికే ‘ఖైదీ నెంబర్ 150’ 2 మిలియన్ మార్కును దాటేసింది. కర్ణాటకలోనూ చిరు స్టామినాను చూపిస్తూ రూ.7 కోట్ల దాకా వసూలు చేసింది. మొత్తంగా ఖైదీ షేర్ ఇప్పటికే రూ.60 కోట్లను దాటింది. గ్రాస్ వసూళ్లు రూ.100 కోట్లకు చేరువగా ఉన్నాయి. ఈ వారాంతంలో సినిమాలేమీ లేవు కాబట్టి చిరు సినిమా మరింతగా వసూళ్లు రాబట్టి అందరికీ లాభాలు పంచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News