మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రంగా ఖైదీ నంబర్ 150.. నందమూరి బాలకృష్ణ వందో సినిమాగా గౌతమిపుత్ర శాతకర్ణి కేవలం ఒక్క రోజు గ్యాప్ లో రిలీజ్ అయ్యాయనే విషయం తెలిసిందే. మరి శాతకర్ణికి ఖైదీ వారం రోజులపాటు ఎలా బ్రేక్ వేశాడనే డౌట్ రావడం సహజం.
దాదాపు అన్ని ఏరియాల్లోనూ ఇదే జరిగినా.. ఒక్క గల్ఫ్ కంట్రీస్ లో మాత్రం గౌతమిపుత్ర శాతకర్ణికి బ్రేక్ వేయాల్సి వచ్చింది. ఇందుకు థియేటర్ల కొరతే కారణంగా తెలుస్తోంది. తెలుగు సినిమాలు ప్రదర్శించే అన్ని థియేటర్లలోనూ ఖైదీనే ఉండడం.. శాతకర్ణికి స్క్రీన్స్ కేటాయించడం సాధ్యం కాలేదట. దీంతో అక్కడ మాత్రం ఈ చిత్రాన్ని రిలీజ్ చేయకుండా ఆపేయాల్సి వచ్చింది. ఈ విషయంలో నిర్మాతలు కూడా చేతులు ఎత్తేశారట.
వారం గడిచిపోవడంతో.. ఇప్పుడు దుబాయ్ తెలుగు అసోసియేషన్ రంగంలోకి దిగి.. శాతకర్ణికి తగినన్ని థియేటర్లు కేటాయించేలా చర్యలు చేపట్టింది. మౌత్ టాక్ కూడా బాగుండడంతో.. గల్ఫ్ కంట్రీస్ నుంచి శాతకర్ణి కోసం డిమాండ్ బాగానే ఉంది. ఇప్పుడు రిలీజ్ అయిపోవడంతో.. గౌతమి పుత్ర శాతకర్ణికి రెస్టాఫ్ ది వరల్డ్ కలెక్షన్స్ మరింతగా పెరిగేందుకు అవకాశాలు ఏర్పడ్డాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/