కాయిన్ ఫైట్ కంప్లీట్ చేసిన ఖైదీ

Update: 2016-09-07 13:50 GMT
మెగాస్టార్ చిరంజీవితో వినాయక్ తీస్తున్న ఖైదీ నెంబర్ 150 మూవీ షూటింగ్ జెట్ స్పీడ్ లో సాగుతున్నట్లుగా కనిపిస్తోంది. షూటింగ్ ప్రారంభంలోనే జైల్ సన్నివేశాలను పిక్చరైజ్ చేసేయగా.. ఆ తర్వాత ఓల్డేజ్ హోమ్ సీన్స్ ను షూటింగ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పుడు ఇంటర్వెల్ లో వచ్చే ఓ సూపర్బ్ ఫైట్ ని పిక్చరైజ్ చేశారని తెలుస్తోంది.

మెగాస్టార్ మూవీ కోసం హైద్రాబాద్ లోనే ప్రత్యేకంగా ఓల్డేజ్ హోమ్ సెట్ వేశారు. దీనికి సంబంధించిన వర్క్ దాదాపు పూర్తి కావచ్చిందని.. అందుకే ఇప్పుడు ఇంటర్వెల్ ఫైట్ ని పిక్చరైజ్ చేశారని తెలుస్తోంది. ఆ సంగతేమో కానీ.. మూవీ మొత్తానికి హైలైట్ సీన్స్ లో ఈ కాయిన్ ఫైట్ ఒకటిగా చెప్పాలి. రూపాయి కాయిన్ సౌండ్.. చిమ్మ చీకటి బేస్ చేసుకున్న ఈ ఫైట్.. కత్తిలో కేకలు పుట్టిస్తుంది. ఇక వివి వినాయక్ డైరెక్షన్ లో.. చిరంజీవి ఈ ఫైట్ ని చేస్తే.. చూసేందుకు రెండు కాదు.. ఎన్ని వేల కళ్లయినా చాలవని చెప్పాలి.

ఇప్పటికైతే ఖైదీ నెంబర్ 150కి సంబంధించి సగానికిపైగా షూటింగ్ కంప్లీట్ అయిపోయినట్లు తెలుస్తోంది. మొదట దొంగ కేరక్టర్ కు సంబంధించిన వర్క్ ను ఫినిష్ చేసి.. ఆ తర్వాత రెండో కేరక్టర్ కు సంబంధించిన పనులు చేసేలా ప్లాన్ చేశాడట దర్శకుడు. ఎలా ప్లాన్ చేసినా.. వచ్చే ఏడాది సంక్రాంతికి అంటే.. 13 జనవరి 2017న ఈ మూవీ విడుదల అయితే ఖాయం అంటున్నాడు నిర్మాత రామ్ చరణ్. ఇక కాజల్ అందచందాలు ఈ సినిమాకు అడిషనల్ అట్రాక్షన్ కానున్నాయి.
Tags:    

Similar News