మెగాస్టార్ చిరంజీవి ఏ రేంజ్ లో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చారో ప్రత్యక్షంగానే చూశాం. ఇప్పుడు టాలీవుడ్ ట్రేడ్ జనాల లెక్కల ప్రకారం.. అధికారికంగానే ఖైదీ నంబర్ 150.. ఓ అరుదైన రికార్డ్ అందుకుంది. ఈ తరం స్టార్లకు కూడా ఎంతో కష్టంగా మారిన.. అసాధ్యం అనుకున్న లక్ష్యాన్ని సింపుల్ గా దాటేశారు చిరంజీవి. ఖైదీ నంబర్ 150 షేర్ వసూళ్లు ఇప్పుడు 100 కోట్ల రూపాయల మార్క్ ను అధిగమించాయి.
బాహుబలి తర్వాత ఈ మార్క్ ను అందుకున్న రెండో చిత్రంగా చరిత్రలోకి ఎక్కేసింది ఖైదీ నంబర్ 150. ఇండస్ట్రీ టాప్ 2 రికార్డ్ స్థానాన్ని ఆక్రమించిన ఖైదీకి.. ఇప్పటివరకూ భారీ వసూళ్లే దక్కాయి. గత ఆదివారం కూడా దాదాపు హౌస్ ఫుల్స్ తో నడవడంతో.. 100 కోట్ల షేర్ మార్క్ ను దాటడం సాధ్యమైంది. అయితే.. ఇకపై పెద్దగా వసూళ్లు వచ్చే అవకాశాలు తక్కువ అంటున్నారు ట్రేడ్ జనాలు. ఇప్పటికే నాని మూవీ నేను లోకల్ తోపాటు.. వచ్చే వారం రానున్న సూర్య మూవీ ఎస్3.. అలాగే నాగార్జున మూవీ ఓం నమో వేంకటేశాయల కోసం.. దాదాపుగా థియేటర్లు ఖాళీ చేయాల్సిన పరిస్థితి.
కొన్ని థియేటర్లు మిగిలినా.. అవి వసూళ్లు స్థాయిని పెద్దగా పెంచకపోవచ్చు. అయితే.. ఫుల్ రన్ వసూళ్లకు ఓవర్ ఫ్లోస్ కూడా కలుస్తాయ్ కాబట్టి.. ఓవరాల్ గా 105 కోట్ల రూపాయల షేర్ లోపు ఖైదీ నంబర్ 150 ఫుల్ రన్ షేర్ కలెక్షన్స్ ఉండే అవకాశం ఉంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/