మెగాస్టార్ చిరంజీవి నటించిన 150వ చిత్రం ఖైదీ నంబర్ 150.. వెండితెరపై అప్పటివరకూ ఉన్న అనేక రికార్డులను తిరగరాసేసింది. కొన్ని ఏరియాస్ లో మినహాయిస్తే.. బాహుబలి రికార్డులను కూడా సవరించింది. ఒక మాస్ మసాలా ఎంటర్టెయినర్ తో 105 కోట్ల రూపాయల షేర్ వసూలు కొత్త చరిత్ర సృష్టించారు చిరు. తాము అసాధ్యం అనుకున్న విషయాన్ని రీఎంట్రీలోనే సాధ్యం చేశారంటూ నాగార్జున ప్రశంసలు కూడా అందుకున్నారు.
ఇప్పుడు బాహుబలి2 వాటన్నిటినీ భారీ మార్జిన్ తో సవరించేసిన సంగతి వాస్తవమే అయినా.. దాని హైప్ వేరు. ఆ సంగతి పక్కన పెడితే.. ఇప్పుడు ఖైదీ నంబర్ 150 బుల్లితెరపైకి వచ్చేస్తోంది. సంక్రాంతికి రిలీజ్ అయిన ఈ చిత్రాన్ని.. ఈ ఆదివారం నాడు అంటే మే 28న సాయంత్రం 6 గంటలకు టెలికాస్ట్ చేస్తోంది మాటీవీ. మూవీ ఆఫ్ ది డెకేడ్ అంటూ వారం ముుందు నుంచే ప్రచారం చేస్తూ హడావిడి చేస్తోంది. సమ్మర్ సీజన్ కావడం.. జనాలు బయటకు వెళ్లేందుకు అంతగా ఇష్టపడకపోవడం.. టీవీలకు కట్టేసే ఐపీఎల్ సీజన్ అయిపోవడం.. బాహుబలి2 హంగామా తగ్గిపోవడం.. మరో భారీ చిత్రం ఏదీ రిలీజ్ లేకపోవడం.. ఇలా చాలా అంశాలే ఖైదీకి సహకరించనున్నాయి.
ఇన్నేసి అంశాలు హెల్ప్ చేసిన తర్వాత.. మరి ఖైదీ నంబర్ 150 టీఆర్పీ రేటింగులు ఎలా ఉంటాయి.. వెండితెరపై మాదిరిగానే.. బుల్లితెరపై ఇప్పటివరకూ ఉన్న హైయెస్ట్ టీఆర్పీ రేటింగుల రికార్డులను చిరు సవరించేస్తారా అని ఇండస్ట్రీ జనాలు ఆసక్తిగా చూస్తున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/