రీమేక్ సినిమా అంటే.. వీలైనంత వరకూ మాతృక ఉన్నట్లే తీసే ప్రయత్నం చేస్తారు. చాలా కొద్దిమంది దర్శకులు మాత్రం.. మాతృకలోని కీలకాంశాల్ని తీసుకొని మార్పులు చేస్తారు. అయితే.. ఇందులో రిస్క్ చాలా ఎక్కువ. రీమేక్ అన్నదే.. అన్ని విధాలుగా మినిమం ఫిఫ్టీ పర్సంట్ సేఫ్ అన్నది తెలిసిందే. తాజా ఖైదీ 150 కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ సినిమా ట్రైలర్ గురించే. తమిళ్ వెర్షన్ కత్తికి రీమేక్ అయిన ఖైదీ నంబరు 150 సినిమాలోని సీన్లు ఏవిధంగా ఉండనున్నాయన్న విషయం ఇట్టే అర్థమవుతుందని చెప్పాలి. మాతృకను యథాతథంగా తీసినట్లుగా కనిపిస్తోంది. సినిమా సంగతి కాసేపు పక్కన పెడితే.. ట్రైలర్ ను సైతం ఒరిజినల్ మాదిరే కట్ చేయించటం ఆసక్తికరమైన అంశం.
శనివారం విడుదల చేసిన బాస్ తాజా చిత్ర ట్రైలర్.. కత్తి ట్రైలర్ కు సేమ్ టు సేమ్ ఉండటం గమనార్హం. రీమేక్ చిత్రం కాబట్టి.. సీన్లు అవే ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు. కానీ.. ట్రైలర్ ను కూడా సేమ్ టు సేమ్ కట్ చేయాల్సిన అవసరం ఉందా? అన్నదే ప్రశ్న. సినిమానే కాదు.. ట్రైలర్ ను దించేయటమేంటి బాసూ?
Full View
Full View
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/