ఖాకీ టీజర్: బీహార్ లో మ‌రీ ఇన్ని దారుణాలా?

Update: 2022-10-29 04:07 GMT
భార‌త‌దేశంలో బీహార్ వెన‌క‌బాటుకు గురైన ప్రాంతంగా అన‌లిస్టులు చెబుతుంటారు. ప్ర‌భుత్వాలు మారినా అక్క‌డ అభివృద్ధి అంతంత మాత్ర‌మే. దాంతో పాటే అక్క‌డ క్రైమ్ రేటు గూండాయిజం గురించి నిరంత‌రం వార్తా క‌థ‌నాల్లో చూస్తూనే ఉంటాం. అయితే బీహార్ లో నేరాలు - ఘోరాలు ఏ రేంజులో ఉంటాయో నేరుగా క‌ళ్ల‌కు గ‌ట్టేలా చూపించే ప్ర‌య‌త్నం జ‌రుగుతోంది. అక్క‌డ యువ‌త‌రం వెప‌న్స్ తో రేయింబ‌వ‌ళ్లు ఎలా హ‌ల్ చ‌ల్ చేస్తారో క‌ళ్ల‌కు గ‌ట్టారు ట్యాలెంటెడ్ ఫిలింమేక‌ర్ నీర‌జ్ పాండే.

నెట్ ఫ్లిక్స్ లో ఈ క్రేజీ క్రైమ్ డ్రామా సిరీస్ ప్ర‌సారం కానుంది. ఈరోజు OTT ప్లాట్ ఫారమ్ నెట్ ఫ్లిక్స్ లో 'ఖాకీ' వెబ్ సిరీస్ టీజర్ ను విడుదల చేసింది. ఇది 'బీహార్ చాప్టర్' అనే ట్యాగ్ లైన్ తో వస్తుంది. బీహార్ లో అత్యధిక క్రైమ్ రేట్ కి కార‌ణాల‌ను అన్వేషిస్తూ.. అక్క‌డ‌ శాంతిని నెలకొల్పడానికి నేరస్థులతో పోలీసు శాఖ చేస్తున్న పోరాటం ఎలాంటిదో టీజ‌ర్ ఆవిష్క‌రించింది. మొత్తం టీజర్ చాలా ఇంట్రెస్టింగ్. మున్ముందు క్రైమ్ డ్రామా ర‌క్తి క‌ట్టించ‌నుంద‌న్న‌ భరోసాని టీజ‌ర్ ఇచ్చింది.

ఈ సిరీస్ లో కరణ్ థాకర్- అవినాష్ తివారీ- అశుతోష్ రాణా- రవి కిషన్- అభిమన్యు సింగ్- శ్రద్ధా దాస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. భావ్ ధులియా దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. నెట్ ఫ్లిక్స్ తో సిరీస్ సృష్టికర్త నీరజ్ పాండే కు ఇదే మొదటి సిరీస్‌.' ఖాకీ' స్ట్రీమింగ్ తేదీని నెట్ ఫ్లిక్స్ త్వరలో ప్రకటించనుంది. అలాగే నెట్ ఫ్లిక్స్ భార‌తీయ మార్కెట్లో ఎదిగేందుకు స‌రికొత్త వ్యూహాల‌తో సిద్ధ‌మైంది. ఇటీవ‌ల దేశీయంగా ఒరిజిన‌ల్ కంటెంట్ ని నిర్మించి అందించ‌డంలో దూకుడు పెంచింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Full View

Tags:    

Similar News