'క్రాక్' సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ''ఖిలాడి''. 'ప్లే స్మార్ట్' అనేది ఈ సినిమా ట్యాగ్ లైన్. 'రాక్షసుడు' ఫేమ్ రమేష్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పెన్ స్టూడియోస్ అధినేత జయంతి లాల్ గడ సమర్పణలో హవీష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సత్యనారాయణ కోనేరు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. రవితేజ డ్యూయల్ రోల్ లో కనిపిస్తున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌధరి - డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని కలిగించాయి. ఈ క్రమంలో నేడు హీరో రవితేజ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ 'ఖిలాడీ' చిత్ర యూనిట్ ఫస్ట్ గ్లిమ్స్ ని విడుదల చేసింది.
'ఖిలాడి' టీమ్ విడుదల చేసిన ఈ వీడియోలో రవితేజ చేతిలో ఒక హ్యమర్ ని పట్టుకుని విలన్స్ ని వేటాడటానికి సన్నద్ధమవుతాడు. ఇందులో రవితేజ అల్ట్రా-స్టైలిష్ లుక్ లో స్మార్ట్ గా కనిపిస్తున్నాడు. దీనికి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ అందించిన అద్భుతమైన బ్యాగ్రౌండ్ స్కోర్ అదనపు ఆకర్షణగా నిలిచింది. మేకర్స్ ఈ చిన్న గ్లిమ్స్ తోనే సినిమాలో యాక్షన్ ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చారు. ఈ చిత్రం కోసం నలుగురు ఫైట్ మాస్టర్స్- రామ్-లక్ష్మణ్ మరియు అన్బు-అరివు పనిచేస్తున్నారు. రమేష్ వర్మ ఉన్నత స్థాయి టెక్నికల్ వాల్యూస్ తో రూపొందుతున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ సమకూరుస్తుండగా.. శ్రీమణి సాహిత్యం అందిస్తున్నారు. 'లూసిఫర్' సినిమాటోగ్రాఫర్ సుజిత్ వాసుదేవ్ ఈ సినిమా కోసం పనిచేస్తున్నారు. శ్రీకాంత్ విస్సా - దేవిశ్రీ ప్రసాద్ సోదరుడు సాగర్ కలసి డైలాగ్స్ రాస్తున్నారు. అమర్ రెడ్డి ఎడిటర్ గా వర్క్ చేస్తున్నారు. 'ఖిలాడీ' చిత్రాన్ని 2021 సమ్మర్ లో విడుదల చేయనున్నారు.
Full View