మాస్ మహారాజా రవితేజ సంక్రాంతి బరిలో `క్రాక్`తో అభిమానులకు బిగ్ ట్రీట్ ఇచ్చారు. గాడి తప్పిన బండిన క్రాక్ తో తిరిగి పట్టాలెక్కించారు. గత వైభవాన్ని తిరిగి తేవాలన్న కసితో రవితేజ ఈ సినిమా కోసం ఎంతగా హార్డ్ వర్క్ చేశారో తెలిసిందే. రాజా ఆశించినది దక్కింది. క్రాక్ బ్లాక్ బస్టర్ విజయం తరవాత బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో రవితేజ బిజీ అయ్యారు.
ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో `ఖిలాడీ` సినిమా చేస్తున్నారు. ఇది భారీ యాక్షన్ ఎంటర్ టైనర్. మాస్ రాజా అభిమానుల్ని ఏ మాత్రం నిరుత్సాహపరచకుండా పక్కా కమర్శియల్ చిత్రంగా దీన్ని తీర్చిదిద్దుతున్నారు. ఇందులో రవితేజ డ్యూయల్ రోల్ పోషిస్తున్నారు. రెండు భిన్నమైన పాత్రలతో మెరుపులు మెరిపిస్తారని సమాచారం. ఇప్పటికే రిలీజైన పోస్టర్లతో సినిమాపై భారీ అంచనాలేర్పడ్డాయి. టాకీ చిత్రీకరణ పూర్తయింది. అటు పోస్ట్ ప్రోడక్షన్ పనులు శర వేగంగా జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో యూనిట్ ప్రచారం లో స్పీడ్ పెంచడానికి రెడీ అవుతోంది. కొన్ని రోజుల్లోనే లిరికల్ సాంగ్స్ ని రిలీజ్ చేయడానికి సన్నద్దమవుతున్నారని టాక్ వినిపిస్తోంది. అలాగే రిలీజ్ ముహూర్తం కూడా ఫిక్స్ అయినట్లు ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది. దీపావళి కానుకగా ఈ చిత్రాన్ని నవంబర్ లో థియేటర్లలో రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారుట. ఈలోపు కరోనాపై కూడా క్లారిటీ వస్తుందని ఇంత గ్యాప్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అంటే రిలీజ్ కి ఇంకా రెండు నెలల సమయం ఉంది. ఈలోపు నెమ్మదిగా అన్ని పనులు పూర్తి చేసుకోవచ్చని భావిస్తున్నారు. అగ్రహీరోల సినిమా రిలీజ్ లపైనా మునుముందు ఫుల్ గా క్లారిటీ వస్తుంది.
మహమ్మారి సన్నివేశంపైనా అధికారులు సమగ్ర సమాచారం వచ్చే వరకూ కొన్నాళ్లు వేచి చూస్తున్నారట. ఇవన్నీ బేరీజు వేసుకునే ఖిలాడీ నిర్మాతలు నవంబర్ కి వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. పెన్ స్టూడియోస్- ఏ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మరో వైపు రవితేజ `రామారావు ఆన్ డ్యూటీ `అనే మరో చిత్రంలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ పేరునే టైటిల్ గా ఫిక్స్ చేయడంతో అంచనాలు భారీగా పెరిగాయి.
పాన్ ఇండియా లెవల్లో బయోపిక్ :
`రామారావు ఆన్ డ్యూటీ ` తర్వాత రవితేజ ఏ సినిమాలో నటిస్తారు? అన్నదానికి ఇటీవల ఓ అప్ డేట్ అందింది. రామారావు ఆన్ డ్యూటీలో రాజా ఏకంగా పెట్టుబడి పెట్టి నిర్మాతగా కొనసాగుతున్న రవితేజ స్క్రిప్ట్ పైనా దృష్టి సారించారు. ఔట్ పుట్ పై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఖిలాడీ నిర్మాణానంతర పనులు సాగుతున్నాయి. రామారావు షూటింగ్ దశలో ఉంది. వీలైనంత త్వరగా అన్ని పనులు పూర్తి చేసి రిలీజ్ చేయాలనేది ప్లాన్.
అయితే ఈ రెండిటితో బిజీగా ఉండగానే మాస్ రాజా మరో చిత్రాన్ని కూడా పట్టాలెక్కించడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఈసారి ఏకంగా పాన్ ఇండియా రేంజులో సినిమా చేయాలని కంకణం కట్టుకున్నాడని తెలుస్తోంది. టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ గురించి గత రెండేళ్లుగా చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ముందుగా ఈ కథ కోసం బెల్లంకొండ శ్రీనివాస్ .. రానా వంటి వారిని సంప్రదించారు. చివరికి రవితేజ వద్దకు వచ్చింది. వంశీకృష్ణ స్క్రిప్ట్ పై కొన్ని సంవత్సరాల పాటు పనిచేశారు. చివరిగా రవితేజతో లాక్ అయినట్లు తెలుస్తోంది. స్క్రిప్ట్ లో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలే ఉన్నట్లు తెలుస్తోంది.
స్టువర్ట్ పురం దొంగ అయిన క్రిమినల్ టైగర్ నాగేశ్వరరావు కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కనుంది. దీనికి కమర్శియల్ అంశాలు జోడించి మాస్ రాజా ఇమేజ్ కు ఎంత మాత్రం తగ్గకుండా తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రాజెక్ట్ వచ్చే ఏడాది ప్రారంభమవుతుంది. ఈ యాక్షన్ డ్రామాను అభిషేక్ అగర్వాల్ అత్యంత భారీ బడ్జెట్ తో బహుభాషల్లో నిర్మిస్తున్నారు.