మిమ్ములను పెళ్లి చేసుకోవాలని ఉందన్న నెటిజన్‌ కు ఖుష్బు షాకింగ్‌ రిప్లై

Update: 2021-08-23 01:30 GMT
1980 ల్లో హీరోయిన్ గా ఎన్నో సూపర్‌ హిట్ చిత్రాల్లో నటించిన ఖుష్బు ప్రస్తుతం రాజకీయ నాయకురాలిగా క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా బిజీ బిజీగా కొనసాగుతోంది. ఈ సమయంలో కూడా ఆమె తన ఫిజిక్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఇటీవల చాలా సన్నబడింది. గత ఏడాదితో పోల్చితే ఈమద్య కాలంలో ఈమె చాలా సన్నగా అయ్యింది. 50 ఏళ్ల వయసులో మూడు పదుల వయసు హీరోయిన్ మాదిరిగా ఖుష్బు కనిపిస్తూ ఉంది. ఈ వయసులో కూడా ఇంత అందం అంటూ అంతా ఆమెను తెగ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఆమెకు ఈ సమయంలో రకరకాలుగా చిత్ర విచిత్రమైన కామెంట్స్ వస్తున్నాయి.

ఇటీవల ఖుష్బు షేర్‌ చేసిన ఫొటోలకు నెటిజన్ స్పందిస్తూ ఐ వాంట్ మారీ యూ ( మిమ్ములను పెళ్లి చేసుకోవాలని ఉంది) అంటూ ట్వీట్‌ చేశాడు. ఆ ట్వీట్ ను ఫన్నీగా తీసుకున్న ఖుష్బు చాలా స్పోర్టివ్ గా స్పందించింది. ఆ ట్వీట్‌ కు ఖష్బు రిప్లై ఇస్తూ.. ఓహ్‌.. నీవు లేట్‌ అయ్యావు. 21 ఏళ్ల క్రితం నువ్వు ఈ విషయాన్ని అడిగి ఉంటే బాగుండేది. అయినా కూడా నా భర్త తో మాట్లాడి చెప్తాను అంటూ స్మైల్‌ ఈమోజీలను షేర్‌ చేసింది.

ఆమె ట్వీట్ కు మళ్లీ సదరు నెటిజన్‌ స్పందిస్తూ మేడం మీ భర్త నుండి ఏమైనా సమాధానం వచ్చిందా అంటూ ఫన్నీగా ప్రశ్నించాడు. మొత్తానికి వీరిద్దరి మద్య జరిగిన ఈ ట్వీట్స్ సంభాషణ నెట్టింట వైరల్‌ అవుతోంది. నెటిజన్స్‌ నుండి ఇలాంటి కామెంట్స్ ఎన్నో వస్తూ ఉంటాయి. ఖుష్బు చాలా స్పోర్టివ్ గా తీసుకోవడం అభినందనీయం అంటూ కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం తమిళం మరియు తెలుగు సినిమాల్లో వరుసగా నటిస్తూనే రాజకీయంగా కూడా బిజీగా ఉన్న ఖుష్బు న్యూ లుక్‌ తో హాట్ టాపిక్‌ గా మారిన విషయం తెల్సిందే.
Tags:    

Similar News