బిజీ షెడ్యూల్స్ తో చ‌ర‌ణ్ హీరోయిన్‌ హ‌ల్ చ‌ల్!

Update: 2022-11-21 15:30 GMT
'ఫ‌గ్లీ' మూవీతో తెరంగేట్రం చేసినా ఇండియ‌న్ క్రికెట‌ర్ 'ఎం.ఎస్ ధోనీ అన్ టోల్డ్ స్టోరీ' మూవీతో హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకుంది బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ. ఆ త‌రువాత సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు న‌టించిన 'భ‌ర‌త్ అనే నేను' సినిమాలో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చేసి తొలి చిత్రంతో క్రేజీ ఫాలోయింగ్ ని సొంతం చేసుకుంది. ప్ర‌స్తుతం తెలుగులో స్టార్ హీరో రామ్ చ‌ర‌ణ్ తో ఏస్ డైరెక్ట‌ర్‌ శంక‌ర్ తెర‌కెక్కిస్తున్న మూవీలో న‌టిస్తోంది.

ప్ర‌స్తుతం వ‌రుస‌గా క్రేజీ సినిమాల్లో న‌టిస్తూ బిజీ బిజీగా వున్న కియారా అద్వానీ టైమ్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ మూడు సినిమాల షూటింగ్ ల‌లో పాల్గొంటూ ఆశ్చ‌ర్య‌పరుస్తోంది. కియారా ప‌రిస్థితి ప్ర‌స్తుతం ఎలా వుందంటే మార్నింగ్ ఓ మూవీ షెగ్యూల్ కంప్లీట్ చేసి మ‌ధ్యాహ్నం మ‌రో మూవీ ట్రైల‌ర్ లాంచ్ .. ఈవినింగ్ మ‌రో మూవీ షూటింగ్ సెట్ లో అన్న‌ట్టుగా వుంది. వ‌రుస‌గా మూడు రోజుల్లో మూడు సినిమాల‌తో కియారా బిజీ బిజీగా గ‌డిపేసింది.

త‌ను విక్కీ కౌష‌ల్ తో క‌లిసి న‌టించిన మూవీ 'గోవింద రామ్ మేరా'. శ‌షాంక్ ఖేతాన్ ద‌ర్శక‌త్వం వ‌హించిన ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కి రెడీగా వుంది. థియేట‌ర్ల‌లో కాకుండా ఈ మూవీని డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ లో డిసెంబ‌ర్ 16న రిలీజ్ చేస్తున్నారు.

ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌ర‌గుతోంది. అప్పుడే ఈ మూవీకి సంబంధించిన‌ ప్ర‌మోష‌న్స్ ని స్టార్ట్ చేశారు. ఈ మూవీ ప్ర‌మోష‌న్స్ మ‌రో రెండు సినిమాల షూటింగ్స్ షెడ్యూల్స్ తో బిజీ బిజీగా గ‌డిపేస్తోంది కియారా.

వ‌రుస‌గా మూడు రోజుల్లో 'స‌త్య‌న్రేమ్ కి క‌థ‌' కోసం ముంబై, అహ‌మ్మ‌దాబాద్ వెళ్లిన కియారా.. ఆ త‌రువాత మ‌రో సినిమా షూటింగ్ కోసం రాజ్ కోట్ వెళ్లి అక్క‌డ షెడ్యూల్ ని పూర్తి చేసింది. శ‌నివారం షూటింగ్ ని ముగించుకున్న కియారా డిసెంబ‌ర్ 16న డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్న 'గోవింద్ నామ్ మేరా' ట్రైల‌ర్ లాంచ్ లో హాజ‌ర‌య్యేందుకు హుటా హుటిన ముంబై చేరుకుంది.

అక్క‌డ ట్రైల‌ర్ లాంచ్ లో పాల్గొని ప‌లు మీడియా సంస్థ‌ల‌కు ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూలు ఇచ్చేసింది. 'షేర్షా' మూవీతో ప్ర‌శంస‌లు పొందిన కియారా ఈ ఏడాది 'భూల్ భులయ్యా 2'తో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ని సొంతం చేసుకుంది.
 



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News