ఫోటో స్టొరీ: సన్నగా అరనవ్వు నవ్విన అమ్మాయి

Update: 2019-04-06 07:09 GMT
అందగత్తె ఏ డ్రెస్ వేసుకున్నా అందంగానే ఉంటుంది. బాలీవుడ్ సుందరాంగి కియారా అద్వాని విషయంలో కూడా అదే సూత్రం వర్తిస్తుంది కదా.. చీర కట్టుకున్నా.. చుడీ దార్ వేసుకున్నా అల్ట్రా మోడరన్ గా కనిపించినా.. ఎలా ఉన్న మగాళ్ళ మతులు పోగొట్టేస్తుంది.   ఇక బికినీలు.. మినీలు అయితే హార్ట్ చూసిన వెంటనే హృదయం జివ్వుమని లాగాల్సిందే.

రీసెంట్ గా ఈ భామ ఒక ప్రింటెడ్ స్కర్ట్.. పైనేమో లైట్ కలర్ డెనిమ్ జాకెట్ ధరించి స్టైల్ కు పర్యాయపదంలా కనిపించింది.  ఈ అమ్మడు ఎలాంటి డ్రెస్సులను ఎలాంటి కాంబినేషన్ లో అయినా ధరించి మెప్పించగలదు అనేందుకు ఇదే ఋజువు.  లూజ్ హెయిర్.. కళ్ళకు స్టైలిష్ గాగుల్స్.. చేతిలో పెద్ద ఫోను .. సిల్వర్ కలర్ హ్యాండ్ బ్యాగ్ తో తెల్లటి లగ్జరీ కారు పక్కన నిలబడి పోజిచ్చింది. ఇవన్నీ ఒక ఎత్తైతే కిక్కెక్కించేలా నవ్విన కియారా నవ్వు పవన్ కళ్యాణ్ 'అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా..' పాటను గుర్తు తెచ్చేలా ఉంది.

ఇక ఈ కిరాకు భామ ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే 'అర్జున్ రెడ్డి' రీమేక్ 'కబీర్ సింగ్'.. 'గుడ్ న్యూస్' సినిమాల్లో నటిస్తోంది.  'గుడ్ న్యూస్' సంగతేమో కానీ 'కబీర్ సింగ్' లో లిప్పు లాకులతో హోరెత్తించి షాహిద్ తో కలిసి బాలీవుడ్ ను షేక్ చేయబోతోందనే టాక్ ఉంది.
 
Tags:    

Similar News