ఒక్క సినిమాకే రెమ్యునరేషన్ డబుల్

Update: 2018-03-16 06:24 GMT
రెమ్యునరేషన్ అనేది స్టార్స్ లెవెల్ కి సంబందించినది అస్సలు కాదు. కొంత మంది ఎంత క్రేజ్ తెచ్చుకున్నా కూడా ఓ లిమిట్ వరకు అందుకుంటున్నారు. దాదాపు మన స్టార్ హీరోల రెమ్యునరేషన్ ఇప్పుడు రెండంకెల సంఖ్యలో నడుస్తోంది. హీరోయిన్స్ కూడా రెండు హిట్స్ అందుకునేసరికి లక్షల్లో నుంచి కోటి లోకి జంప్ చేస్తున్నారు. అసలు మ్యాటర్ లోకి వస్తే.. టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతోన్న ఓ బాలీవుడ్ భామ రెమ్యునరేషన్ లో అప్పుడే బారి మార్పులు చేసింది.

ప్రస్తుతం మహేష్ బాబు - భరత్ అనే నేను సినిమాలో నటిస్తోన్న కైరా అద్వానీ సినిమా రిలీజ్ కాకముందే క్రేజ్ ను గట్టిగా అందుకుంటోంది. కనీసం ఈ భామ ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ కాలేదు. కానీ అప్పుడే మరో టాలీవుడ్ స్టార్ హీరోతో సినిమా చేయడానికి రెడీ అయ్యింది. రామ్ చరణ్ - బోయపాటి సినిమాకు ఒప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ రెండు సినిమాల మధ్య అమ్మడి రెమ్యునరేషన్ వ్యత్యాసం ఎంతో తెలిస్తే షాక్ అవుతారు.

భరత్ అనే నేను సినిమాకు 50 లక్షల వరకు తీసుకుంటే రామ్ చరణ్ సినిమా కోసం ఏకంగా డబుల్ రేట్ ను పెంచి ఫైనల్ గా కోటి అనేసిందట. ఎందుకంటే భరత్ ప్రాజెక్టుతో ఇప్పటికే భారీ ఆఫర్స్ వస్తున్నాయి. కాన్సెప్ట్ నచ్చకపోవడంతో కొన్ని సినిమాలకు నో చెప్పిందట. బోయపాటి చెప్పిన కథలో ఆమె పాత్ర నచ్చడంతో వెంటనే ఒప్పేసుకున్నట్లు సమాచారం. అయితే రెమ్యునరేషన్ విషయాన్ని కూడా ముందే చెప్పడంతో నిర్మాతలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. 
Tags:    

Similar News