సరైన హిట్ తగిలింది..బ్యూటీ ఫీజు పెంచింది!

Update: 2019-06-26 14:42 GMT
అందాల భామ కియారా అద్వాని బాలీవుడ్ ప్రేక్షకులకే కాదు టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా పరిచయం ఉన్న హీరోయిన్.   తెలుగులో 'భరత్ అనే నేను'.. 'వినయ విధేయ రామ' సినిమాల్లో నటించింది. ఇక హిందీలో కూడా ఈ భామ 'M.S. ధోని: ది అన్ టోల్డ్ స్టొరీ' లాంటి సూపర్ హిట్స్ లో నటించింది.  'లస్ట్ స్టోరీస్' వెబ్ సీరీస్ తో బోల్డ్ భామగా కూడా పేరు తెచ్చుకుంది. అయితే వెబ్ సీరీసులు.. సినిమాలన్నీ ఒక ఎత్తు ఈమధ్యే రిలీజ్ అయిన 'కబీర్ సింగ్'మరో ఎత్తు.

తెలుగు సూపర్ హిట్ 'అర్జున్ రెడ్డి' కి బాలీవుడ్ రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో కియారా హీరోయిన్ గా నటించింది.  షాహిద్ కపూర్ కు గర్ల్ ఫ్రెండ్ గా ఇన్నోసెంట్ పాత్రలో నటించి..బోల్డ్ గా లిప్పు లాకు లిచ్చి ప్రేక్షకులను తన మాయలో పడేసింది. విమర్శలు..  ఇతర హంగామాలు పక్కన పెడితే ఈ సినిమా బ్లాక్ బస్టర్ దిశగా పయనిస్తోంది. ఈ సినిమా విజయంతో హీరో షాహిద్ కే కాదు కియారాకు కూడా బాలీవుడ్ లో డిమాండ్ పెరిగిందట. ఇప్పటికే కియారా చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. అవి కాకుండాకొత్తగా సైన్ చేసే సినిమాలకు తన రెమ్యూనరేషన్ ను పెంచిందట. 

ఇప్పటివరకూ కియారా రెమ్యూనరేషన్ కోటి రూపాయల లోపే ఉండేదని.. ఇప్పుడు దాదాపు డబుల్ అయిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయినప్పటికీ కరణ్ జోహార్ లాంటి నిర్మాతలు కియారాకు ఉండే క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు డబల్ ఫీజ్ ఇచ్చేందుకు కూడా రెడీ అవుతున్నారట.  


Tags:    

Similar News