ఫోటో స్టొరీ: మీట్ మిస్ లక్ష్మి బాంబ్ బ్యూటీ

Update: 2019-04-27 16:39 GMT
కియారా అద్వానికి ఇప్పటికే  క్రేజ్ భారీగా ఉంది. ఇక అర్జున్ రెడ్డి బాలీవుడ్ రీమేక్ 'కబీర్ సింగ్' రిలీజ్ అయితే ఆ క్రేజ్ మరింతగా పెరగి  ఆకాశాన్ని తాకడం ఖాయం.  మరో రెండు నెలలలో 'కబీర్ సింగ్' రిలీజ్ అయిన తర్వాత ఆ విషయంపై కూడా మనకు క్లారిటీ వచ్చేస్తుంది. ఇదిలా ఉంటే ఈ భామ కు వరసగా బాలీవుడ్ లో క్రేజీ ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే 'కబీర్ సింగ్'.. 'గుడ్ న్యూస్' సినిమాల్లో నటిస్తోందనే సంగతి తెలిసిందే. ఈ సినిమా కాకుండా అక్షయ్ కుమార్ నటిస్తున్న మరో సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది.

లారెన్స్ హారర్ కామెడీ 'కాంచన: ముని 2' బాక్స్ ఆఫీస్ దగ్గర ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఇప్పుడు బాలీవుడ్ లో 'లక్ష్మి బాంబ్' పేరుతో రీమేక్ చేస్తున్నారు.  హీరో అక్షయ్ కుమార్ కాగా హీరోయిన్ కియారా అద్వాని.  ఈ సినిమాకు మన లారెన్స్ దర్శకత్వం వహిస్తున్నాడు.  తాజాగా ఈ సినిమా షూటింగ్ లోకేషన్ లో క్లాప్ బోర్డ్ ను పట్టుకొని కియారా ఒక క్యూట్ పోజిచ్చింది. ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.  ఇప్పటివరకూ ఈ సినిమా టైటిల్ స్పెక్యులేషన్ లాగానే ఉండేది.  కానీ ఈ క్లాప్ బోర్డ్ ఫోటో తో  సినిమా టైటిల్ అందరికీ కన్ఫాం అయిపోయింది.  అంతే కాదు. ఈ టైటిల్ ను Laxmi Bomb  అని రాయకుండా Laaxmi Bomb అని ఫిక్స్ చేశారు కాబట్టి స్ట్రాంగ్ గా న్యూమరాలజీ ఫాలో అవుతూ ఒక a  ని అదనంగా జోడించారని కూడా అర్థం అవుతోంది.

ఈ ఫోటోలో యాజ్ యూజువల్ గా కియారా ఒక బ్యూటిఫుల్ పోజిచ్చింది. స్లీవ్ లెస్ వైట్ టీ షర్ట్ వేసుకొని లూజ్ హెయిర్ తో యమా స్టైల్ గా క్లాప్ కొడుతోంది. అదేంటో అందమైన అమ్మాయిలు ఏం చేసినా అందంగా ఉంటుంది.  ఇక అదే పనిని అందాల రాణి లాంటి కియారా చేస్తే మాట్లాడేందుకు నోటమాటలు రావు.  అందుకే ఈ ఫోటోకు నెటిజనులు లైకులు కొడుతున్నారు..  షేర్ చేస్తున్నారు.  నో మాటలు!
Tags:    

Similar News