చురుకైన చూపులతో కుర్రకారు గుండెల్ని టచ్ చేయడం ఎలానో కియరా అద్వాణీనే అడగాలి. నేటితరం నాయికల్లో జెట్ స్పీడ్ తో కెరీర్ పరంగా దూసుకెళ్లడంలో కియరా ఫాలో చేసిన టెక్నిక్ ఏమాత్రం మిస్ ఫైర్ కాలేదంటే తనలో ఉన్న స్కిల్ అలాంటిది. తెలుగులో భరత్ అనే నేను- వినయ విధేయ రామ తర్వాత వేరొక సినిమాకి సంతకం చేయని ఈ బ్యూటీ ఆర్.సి 15 కోసం ఓకే చెప్పడం షాకిచ్చింది. తారక్ తో కొరటాల సినిమాకి ప్రపోజల్స్ లో ఉన్నా ఇంతలోనే చరణ్ - శంకర్ కాంబినేషన్ మూవీకి సంతకం చేసి పెద్ద ఝలకిచ్చింది.
ఇకపోతే కియరా సోషల్ మీడియాల్లో రెగ్యులర్ గా ఫ్యాన్స్ కి ఇస్తున్న ఝలక్ లు మామూలుగా లేవు. నిరంతరం ఈ బ్యూటీ ట్రెండీ ఫోటోషూట్లతో సోషల్ మీడియాల్లో హీట్ పెంచుతోంది. తాజాగా కియరా కిల్లర్ లుక్ ఒకటి అంతర్జాలంలో వైరల్ గా మారింది. క్రీగంటి చూపులతో కుర్రకారు గుండెల్ని కోసేస్తోంది కియరా. ఇక ఎంపిక చేసిన డిజైనర్ డ్రెస్ ఎంతో ట్రెడిషనల్ గా కనిపిస్తూనే కియరాలో హాట్ యాంగిల్ ని ఎలివేట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో అంతర్జాలంలో వైరల్ గా మారింది.
ప్రియుడిని పట్టించుకోలేదనుకుంటే..!
ఇక కియరా ఓవైపు బాలీవుడ్ లో మరోవైపు సౌత్ లో వరుస సినిమాలతో ఊపిరాడనంత షెడ్యూల్ ని మ్యానేజ్ చేస్తోంది. అదే క్రమంలో తన ప్రియుడిని మర్చిపోయిందంటూ ఒకటే గుసగుసలు వేడెక్కిస్తున్నాయి. అయితే ఇంతలోనే రహస్య ప్రియుడు సిద్దార్థ్ మల్హోత్రా కొత్త పోస్ట్ లో తన వేకువఝాము వ్యాయామం దృశ్యాల్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. దానికి వెంటనే కియారా అద్వానీ స్పందించారు.
సిద్ధార్థ్ మల్హోత్రా తన పుకార్ స్నేహితురాలు కియారా అద్వానీతో కలిసి నటించిన తదుపరి చిత్రం షేర్షా విడుదలకు సిద్ధమవుతోంది. ఇంత బిజీ షెడ్యూల్ లోనూ పగటిపూట కఠినమైన వ్యాయామం చేస్తూ కనిపిస్తున్నారు. ప్రమోషన్ ల మధ్య తన వ్యాయామ దినచర్యకు స్కిప్ కొట్టడం లేదు. తాజాగా ఇన్ స్టాలో వ్యాయామం చేస్తున్న ఫోటోలను షేర్ చేసాడు సిద్ధార్థ్ మల్హోత్రా. వర్కవుట్ లో భాగంగా అతను బాటిల్ రోప్ వ్యాయామం చేసాడు. ఈ సందర్భంగా చీలిపోయిన నిక్కరును ఫోటోలో చూపించాడు. వర్కౌట్ లకు ఎప్పటికీ సమయం ఉండదు.. మీరు దానిని పూర్తి చేయాలి.. ఎర్లీ మానింగ్ వర్కవుట్స్ అంటూ సిద్ధార్థ్ వ్యాఖ్యను జోడించాడు. నిజానికి అంతగా తెలియనివారికి.. తాడు వ్యాయామాలు భయపెట్టేవిగా అనిపించవచ్చు.. కానీ అవి పైభాగంలో కండరాలు.. చేతులు.. యాబ్స్.. వీపు .. గ్లూట్ లకు శిక్షణ ఇచ్చే సాధారణ వ్యాయామ సాధనం. అవి మన శరీరంలోని కొవ్వును బర్న్ చేసేందుకు సహాయపడతాయి.
సిద్ధార్థ్ చిత్రాన్ని పోస్ట్ చేసిన తర్వాత దానికి 2 లక్షలకు పైగా లైకులు అనేక వ్యాఖ్యలు వచ్చాయి. అతని స్నేహితురాలు కియారా అద్వానీ.. వరుణ్ ధావన్.. ఆయుష్మాన్ ఖురానా ..టైగర్ ష్రాఫ్ వంటి మరికొందరు బాలీవుడ్ ప్రముఖులు ఈ పోస్ట్ కి ఈమోజీలు షేర్ చేశారు.
షేర్ షాలో కియారా అద్వానీతో మొదటిసారి సిద్ధార్థ్ స్క్రీన్ ను పంచుకోనున్నారు. సిద్దార్థ్ వార్ డ్రామాలో కెప్టెన్ విక్రమ్ బాత్రా పాత్రను పోషిస్తుండగా.. కియారా తన కాబోయే భార్య డింపుల్ చీమా పాత్రను పోషిస్తోంది. జమ్మూ కాశ్మీర్ రైఫిల్స్ కి చెందిన కెప్టెన్ విక్రమ్ బాత్రా 1999 జూన్ లో ద్రాస్ సబ్ సెక్టార్ లో కార్గిల్ యుద్ధంలో తోటి అధికారిని రక్షించే సమయంలో మరణించాడు. అతను పాయింట్ 5140 ని పట్టుకోవడంలో కీలకపాత్ర పోషించాడు. షేర్షా వాస్తవానికి 2020 థియేట్రికల్ విడుదల కోసం రెడీ అయినా కానీ మహమ్మారి కారణంగా వాయిదా పడింది. ఇండిపెండెన్స్ డే వారాంతానికి ముందు ఇది అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కానుంది.