ఫోటో స్టొరీ: ఇషిత అంబానీతో చిట్టి కియారా

Update: 2018-09-24 10:19 GMT
బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాని మహేష్ బాబు సినిమా 'భరత్ అనే నేను' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో కియారాకు మంచి ఆఫర్లే వచ్చాయి.. వాటిలోనుంచి చరణ్ సినిమాను మాత్రం ఎంపిక చేసుకుంది.  అదే బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న #RC12.

ఇదిలా ఉంటే కియారా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా చైల్డ్ హుడ్ పిక్స్ పోస్ట్ చేసింది. దానికో కారణం ఉంది.  ముఖేష్ అంబానీ ముద్దుల కూతురు ఇషిత త్వరలో ఆనంద్ పిరామల్ ను పెళ్లి చేసుకోనుంది కదా.  ఆ సందర్భంగా ఇషిత తనకు చిన్ననాటి స్నేహితురాలని చెబుతూ తనతో కలిసి ఉన్న నాలుగు ఫోటోల కోల్లెజ్ ను పోస్ట్ చేసింది. అందులో మూడు చిన్ననాటి ఫోటోలు కాగా ఒకటి మాత్రం తాజా ఫోటోగ్రాఫ్.  ఆ ఫోటోలకు పెద్ద క్యాప్షన్ పెట్టింది.  "మీరు పెరిగే సమయంలో మీతో పాటు కొంతమంది ప్రత్యేకమైన వ్యక్తులు ఉంటారు. నా చిన్ననాటి స్నేహితురాలు.. ఇప్పటికీ నన్ను కేరింగ్ గా చూసుకునే ఇషిత.  ఇప్పటికీ ఇంతో వినయంగా ఉంటుంది.  కాబోయే పెళ్లికూతురా.. నీలో ఉన్న చిన్నపిల్లను ఎప్పటికీ అలానే ఉంచు.  ఎప్పటికీ నీ అలియూ(కియారా). కంగ్రాచులేషన్స్."

ఈ పోస్ట్ కి చాలామంది నెటిజనులు పాజిటివ్ గా స్పందించారు.  క్యూట్ గా ఉన్నారని.. మంచి ఫ్రెండ్స్ అని మెచ్చుకున్నారు. ఇక కొంతమంది నెగెటివ్ గ్యాంగ్ ఉంటుంది కదా వాళ్ళు మాత్రం కియరాను విమర్శించడం మొదలుపెట్టారు. నిన్ను ఏదో కష్టపడి పైకొచ్చిన నటి అని అభిమానించాం.. నువ్వు చూస్తే అంబాని ముద్దుల కూతురికి క్లోజ్ ఫ్రెండ్. ఇప్పుడు తీరిగ్గా చెప్తావా ఈ విషయం అని మండిపడ్డారు. నువ్వు అంబానీ లింక్స్ ఏవీ వాడకుండా హీరోయిన్ అయి ఉంటావని మేము ఎలా నమ్మాలి? అని మండిపడుతున్నారు.  ఏంటో ఈ లోకం.. ఏం చేసినా తప్పే!
Tags:    

Similar News