ఫోటో స్టొరీ: ర్యాంప్ ను రఫ్ఫాడించిన కియారా

Update: 2018-10-25 16:55 GMT
మహేష్ బాబు సినిమా 'భరత్ అనే నేను' లో నటించి బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాని తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది.  వెంటనే రామ్ చరణ్ - బోయపాటి సినిమాలో అవకాశం దక్కించుకుంది కూడా.  మరో వైపు 'లస్ట్ స్టోరీస్' లాంటి ఘాటు వెబ్ సీరీస్.. సోషల్ మీడియాలో ఫోటో షూట్లతో అభిమానుల సంఖ్యను భారీగానే పెంచుకుంటోంది.

తాజాగా ఒక ఫ్యాషన్ ఈవెంట్ లో పాల్గొన్న ఈ బ్యూటీ టాప్ లీగ్ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా కాస్ట్యూమ్స్ లో తళుక్కున మెరిసింది.  మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన బ్రైడల్ కాస్ట్యూమ్స్.. స్పెషల్ ఈవెంట్స్ లో ధరించే కాస్ట్యూమ్స్ లో ఈ బ్యూటీ సందడి చేయడం కామనే.   కానీ ఈసారి మాత్రం అల్ట్రా స్టైలిష్ గెటప్ లో జీన్స్ జాకెట్ భుజాన వేసుకుని 'ఓన్లీ' బ్రాండ్ టాప్.. బ్లాక్ బాటమ్ తో ర్యాంప్ ను రఫ్ఫాడించింది.  అసలేమాత్రం యాక్సెసరీస్ లేకుండా పూర్తిగా వెస్టర్న్ వేర్ లో ఇలా కనిపించి నెటిజనుల ప్రశంసలు అందుకుంటోంది.  

ఈ విషయం సరే గానీ కియారా ప్రస్తుతం 'అర్జున్ రెడ్డి' బాలీవుడ్ రీమేక్ లో నటిస్తోంది.  షాహిద్ కపూర్ హీరోగా తెరకెక్కుతున్న ఈ హిందీ చిత్రానికి ఒరిజనల్ దర్శకుడు సందీప్ వంగానే దర్శకత్వం వహిస్తున్నాడు.  ఈ ఊపులో కియారా ముద్దుల హద్దులు చెరిపి బాలీవుడ్ ను షేక్ చేయడం ఖాయం.


Tags:    

Similar News