2022-23 మోస్ట్ అవైటెడ్ చిత్రంగా RC15 పాపులరైంది. స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాని అత్యంత వేగంగా పూర్తి చేస్తుండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఆయన కెరీర్ బెస్ట్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని టాక్్ ఉంది. రామ్ చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి #RC15 అనేది వర్కింగ్ టైటిల్. ఇందులో భారీ తారాగణం నటిస్తోంది. ఇండస్ట్రీ బెస్ట్ టెక్నీషయన్లు పని చేస్తుండగా విదేశీ స్టంట్ నిపుణులు ఫైట్స్ ని కొరియోగ్రాఫ్ చేస్తున్నారు.
ఈ చిత్రంలో కియారా అద్వానీ కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే 60శాతం పైగా షూటింగ్ పూర్తయింది. చిన్న బ్రేక్ లో ఉన్న యూనిట్ తిరిగి సినిమా షూటింగ్ ను ప్రారంభించనుంది. ఈ షెడ్యూల్‌లో కియారా అద్వానీ కూడా పాల్గొంటుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో అడుగుపెట్టిన ఆమె రేపటి నుంచి సెట్స్ లో జాయిన్ కానుంది. ఈ షెడ్యూల్ లో సునీల్- శ్రీకాంత్ మరికొంత మంది ఆర్టిస్టులు పాల్గొంటారు. ఎస్.ఎస్. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. నిర్మాత దిల్ రాజు తన కెరీర్ బెస్ట్ బడ్జెట్ ని శంకర్ కోసం పెడుతున్నారన్న టాక్ ఉంది.
టైటిల్ లాంచ్ ఎప్పుడు?
ఆర్.సి 15 కోసం చరణ్ కోసం రేయింబవళ్లు ఎంతో హార్డ్ వర్క్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆర్.ఆర్.ఆర్ తర్వాత మరోసారి మ్యాసివ్ పాన్ ఇండియా హిట్ కొట్టాలన్నది అతడి ప్రయత్నం. ఇక ఆర్.సి 15 కంటెంట్ పైనా టైటిల్ పైనా చరణ్ ఎక్కువ ఆసక్తిగా ఉన్నారు. ఇప్పుడు టైటిల్ ని ఫైనల్ చేయాల్సి ఉంది.
దర్శక నిర్మాతలు శంకర్- దిల్ రాజుతో చరణ్ దీనిపై కథానాయకుడు చరణ్ చర్చించారని ఇటీవల గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే టైటిల్ పై ఒక్కొక్కరి ఎంపిక ఒక్కోలా ఉంది. నిజానికి ఈ చిత్రానికి సర్కారోడు! అనే టైటిల్ ని ఎంపిక చేయాలని దిల్ రాజు భావిస్తున్నారని గుసగుసలు వినిపించాయి. అయితే శంకర్ మాత్రం ఆఫీసర్ (అధికారి) అనే టైటిల్ పై మొగ్గు చూపుతున్నారని తెలిసింది. సర్కారోడు వర్సెస్ ఆఫీసర్! ఈ రెండిటిలో ఏది బెస్ట్ అన్నది తేలాల్సి ఉందిట.
అయితే చరణ్ మాత్రం శంకర్ ఎంపిక చేసుకున్న ఆఫీసర్ టైటిల్ ని ఫైనల్ చేయాల్సిందిగా సూచించినట్టు కథనాలొస్తున్నాయి. ఆఫీసర్ టైటిల్ ఎంతో క్లాసీగా ఉంది. అలాగే దీనికి యూనివర్శల్ అప్పీల్ కూడా ఉంది. కానీ దిల్ రాజు ఎంపిక చేసుకున్న సర్కారోడు మాసీగా ఉంది. పైగా పూర్తి లోకల్ టైటిల్ ఇది. దీనికి పాన్ ఇండియా రీచ్ కనిపించడం లేదు.
ఒక నిజాయితీ గల IAS అధికారి జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? అన్న లైన్ తో శంకర్ అసాధారణ విజువల్స్ ని క్రియేట్ చేస్తున్నారని తెలిసింది. ఇందులో చరణ్ సీఎం పాత్రలోనూ కనిపిస్తారన్న టాక్ ఉంది. అందుకే చరణ్ పాత్రకు తగ్గట్టు ఆఫీసర్ లేదా అధికారి యాప్ట్ టైటిల్ అని అభిమానులు భావిస్తున్నారు. కానీ సుదీర్ఘ తర్జనభర్జనల అనంతరం చివరికి ఏ టైటిల్ ని ఫైనల్ చేస్తారు? అన్నదానికి కాలమే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఇక ఆ రెండు టైటిల్స్ కాకుండా మెగాభిమానులు ఇంకేదైనా టైటిల్ సూచిస్తారా? అన్నది చూడాలి.