నా రొమాన్స్‌ ఓల్డ్‌ స్టైల్‌ లో ఉంటుంది : కియారా

Update: 2020-12-12 05:30 GMT
బాలీవుడ్‌ లో ప్రస్తుతం మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌ కియారా అద్వానీ. అర్జున్‌ రెడ్డి హిందీ రీమేక్‌ కబీర్ సింగ్‌ తర్వాత కియారా అద్వానీ కెరీర్‌ పూర్తిగా టర్న్‌ అయ్యింది. బాలీవుడ్‌ లో వరుసగా సినిమాలు చేస్తోంది. ఇటీవల ఈమె 'ఇందూకి జవానీ' సినిమా చేసింది. ఆ సినిమాలో మరీ బోల్డ్‌ అమ్మాయిగా నటించింది. డేటింగ్‌ యాప్స్‌ ను నమ్మి మోసపోయే అమ్మాయి పాత్రలో కియారా కనిపించింది. ఈతరం అమ్మాయిలు మరీ ఇలా తయారు అయ్యారా అనిపించేలా ఆ పాత్ర ఉంటుంది. మరి కియారా ఎలాంటి అమ్మాయి అంటూ ఈ సమయంలో చాలా మంది నెటిజన్స్‌ ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో కియారా క్లారిటీ ఇచ్చింది.

ఇందూకి జవానీ సినిమాలో నటించినా కూడా నేను ఇందు టైప్‌ అస్సలు కాదు. ఇందూ ఈతరం రొమాంటిక్‌ లైఫ్‌ స్టైల్‌ కలిగి ఉన్న అమ్మాయి. కాని నా రొమాంటిక్‌ లైఫ్‌ స్టైల్‌ మాత్రం చాలా ఓల్డ్. నా రొమాంటిక్‌ థాట్స్‌ అన్ని కూడా ఓల్డ్‌ గా ఉంటాయి. డేటింగ్‌ యాప్స్‌ వరకు నేను వెళ్లాలనుకోవడం లేదు అంటూ తన మనసులోని విషయాలను చెప్పింది. ఓల్డ్‌ రొమాన్స్‌ స్టైల్‌ ను ఇష్టపడుతాను అని.. కాలంతో అన్ని విషయాల్లో మారాలని ఏమీ లేదు అంటూ చెప్పుకొచ్చింది. సినిమాలో వరకే ఆ రొమాంటిక్‌ డేటింగ్‌ యాప్‌ లైఫ్‌ స్టైల్‌. కాని నిజ జీవితంలో మాత్రం అలా కాదని క్లీయర్‌ గా బల్ల గుద్ది మరీ చెప్పింది.
Tags:    

Similar News