తనదైన అందం చందం ప్రతిభతో కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తోంది ముంబై బ్యూటీ కియరా అద్వాణీ. ఎం.ఎస్.ధోని .. భరత్ అనే నేను చిత్రాలతో బాలీవుడ్ - టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ రేంజుకు వెళ్లిపోయింది. ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోలు పిలిచి అవకాశాలిచ్చారు. లస్ట్ స్టోరీస్ లఘు చిత్రంలో పెర్ఫామెన్స్ కి ఫిదా అయిపోయిన పలువురు హీరోలు కియరా అంట క్రేజీగానూ ఫీలయ్యారు. తెలుగులో వినయ విధేయ రామ ఫ్లాప్ తర్వాత కియరా మరో సినిమాకి సంతకం చేసింది లేదు. ప్రస్తుతానికి చర్చలు సాగిస్తోందట. అటు బాలీవుడ్ లో మాత్రం పలు క్రేజీ చిత్రాల్లో అవకాశాలు అందుకుంటోంది.
అదంతా సరే కానీ.. కియరా గురించిన ఓ టాప్ సీక్రెట్ తాజాగా లీకై అభిమానులకు పెద్ద షాకిస్తోంది. ఈ అమ్మడు పెద్ద తెరపై అంతందంగా నవలా నాయికలా తళతళలాడిపోవడానికి కారణం.. ఆ ముఖ వర్చస్సులో అంతటి మెరుపు వెనక లాజిక్ ఏంటో లీకైంది. ఈ భామ ముఖంలో ముడుతల్ని .. లైన్స్ ని తగ్గించుకునే బొటాక్స్ ట్రీట్ మెంట్ తీసుకుందనేది తాజా లీక్. ఆ విషయాన్ని కియరా స్వయంగా అంగీకరించింది ఓ ఇంటర్వ్యూలో.
ఓసారి రాత్రి వేళ బిరియానీ తిని పడుకున్నా. దానివల్ల మరుసటి రోజు బుగ్గలపై ఏదో తేడా కనిపించింది. ఆ ఫోటోలు అంతర్జాలంలోనూ వైరల్ అవ్వడంతో వాటికి అభిమానుల నుంచి తీవ్రమైన ట్రోలింగ్స్ ఎదుర్కోక తప్పలేదు. ఆ తర్వాత ముఖంలో మార్పు కోసం బొటాక్స్ ని ఆశ్రయించానని కియరా తెలిపింది. ఓ వస్త్ర దుకాణ సముదాయం ప్రారంభోత్సవంలో పాల్గొన్నప్పటి మిస్టేక్ అది అంటూ గతాన్ని తవ్వుకుంది. `బుగ్గలపై ఓ రెండు చోట్ల ఉబ్బి కనిపించింది. బుగ్గ ఎముక దగ్గర తేడాగా కనిపించింది. దాంతో దానిని సరిచేసుకునేందుకు బొటాక్స్ ని ఆశ్రయించానని వెల్లడించింది.
శ్రీదేవి .. ఆర్తి అగర్వాల్.. అతిదీ అగర్వాల్ సహా ఎందరో నాయికలు ఈ తరహా చికిత్సలు చేయించుకున్నారని రెగ్యులర్ గా వింటూనే ఉంటాం. ఇప్పుడు కియరా వంతు. కత్తి గాటు పడనిదే అందం పెరుగునా? అయితే ఇది శస్త్ర చికిత్స ఏమీ కాదు. కత్తి తో కోయాల్సిన పని లేకుండా చాలా సింపుల్ గా బొటాక్స్ లో ట్రీట్ చేస్తారు. బొటాక్స్ లో 60 లక్షల (6 మిలియన్ల) రకాల ట్రీట్ మెంట్లు ఉన్నాయంటే నమ్మగలరా? అందులో కియరా ముఖాకృతిలో మార్పు కోసం చేయించుకుంది. అందం రెట్టించిన ఈ బ్యూటీ ఆ కొత్త లుక్ తోనే తదుపరి కబీర్ సింగ్ చిత్రంలో కనిపించబోతోందన్నమాట.