భరత్ అనే నేను మరియు వినయ విధేయ రామ సినిమాల్లో నటించిన కియారా అద్వానీ బాలీవుడ్ లో బిజీ అయ్యింది. ఆమె మళ్లీ తెలుగులో నటించాలని చాలా మంది కోరుకుంటున్నారు. ఇటీవల ఆమె తెలుగు లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. కియారా అద్వానీ తెలుగు లో చేస్తున్న సినిమాల గురించి పుకార్లే పుకార్లు అన్నట్లుగా వస్తున్నాయి. పెద్ద ఎత్తున నెట్టింట వస్తున్న వార్తలకు కియారా కాస్త క్లారిటీ ఇచ్చింది. నెట్టింట జరుగుతున్న ప్రచారం పై కియారా లైవ్ చాట్ లో స్పందించింది.
కియారా ఇండస్ట్రీలో అడుగు పెట్టి 7 సంవత్సరాలు అయిన సందర్బంగా అభిమానులతో చిట్ చాట్ చేసింది. ఈ సందర్బంగా సౌత్ ఆడియన్స్ కొందరు ఆమెను తెలుగులో ఎప్పుడు రీ ఎంట్రీ అంటూ ప్రశ్నించారు. ఆ సమయంలో ఆమె స్పందిస్తూ ప్రస్తుతం తెలుగు లో సినిమా కోసం రెడీ అవుతున్నట్లుగా చెప్పుకొచ్చింది. త్వరలోనే ఒక ఆసక్తికర విషయాన్ని మీకు తెలియజేస్తానంటూ క్లారిటీ ఇచ్చింది. అయితే ఆ సినిమా ఏంటీ.. ఎవరితో అనే విషయాలపై స్పందించలేదు.
టాలీవుడ్ లో కియారా రీ ఎంట్రీ కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించబోతున్న సినిమా తో అంటూ కొందరు.. రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందబోతున్న సినిమా తో అంటూ మరి కొందరు ప్రచారం అంటున్నారు. కియారా అద్వానీ తెలుగులో ఈ రెండు సినిమాలతో ఏ సినిమా తో ఎంట్రీ ఇవ్వబోతుంది అనే విషయమై త్వరలోనే మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి అయితే కియారా అద్వానీ తెలుగు ఎంట్రీ ఖాయం గా తేలిపోయింది.