శ్రీవల్లిని చంపేసి ఫారిన్ బ్యూటీ ని దించేస్తున్నారా..!

Update: 2022-06-24 05:30 GMT
అల్లు అర్జున్‌.. సుకుమార్‌ కాంబోలో రూపొంది గత ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పుష్ప పార్ట్‌ 1 భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. సౌత్ తో పాటు నార్త్‌ లో కూడా వందల కోట్ల వసూళ్లు రాబట్టడంతో పుష్ప 2ను అంతకు మించి అన్నట్లుగా రూపొందించేందుకు దర్శకుడు సుకుమార్‌ చాలా హోమ్ వర్క్ చేస్తున్నాడట. గత ఆరు నెలలుగా స్క్రిప్ట్‌ వర్క్‌ చేస్తున్నాడు.

పుష్ప పార్ట్ 1 తో పాటే పార్ట్‌ 2 కథను కూడా రెడీ చేసినా కూడా ఇప్పుడు పుష్ప రేంజ్ పాన్‌ ఇండియా.. అంతకు మించి కనుక ఆ స్థాయి లోనే పుష్ప 2 స్క్రిప్ట్‌ ఉండాలనే ఉద్దేశ్యంతో మొదటి వర్షన్ లో మార్పులు చేర్పులు చేయాలని భావించారు. గత ఆరు నెలలుగా పుష్ప 2 స్క్రిప్ట్‌ పై వర్క్ చేస్తూ చివరకు పూర్తిగా మార్చేశారట. తాజాగా బన్నీకి సుకుమార్ ఫైనల్‌ స్క్రిప్ట్‌ ను వినిపించడం.. బన్నీ కూడా ఓకే చెప్పడం జరిగి పోయిందట.

ఈ సమయంలోనే మీడియాలో మరియు సినీ మీడియా వర్గాల్లో కథ గురించి రకరకాలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మరో వైపు సోషల్ మీడియాలో ఎక్కడ లేని గాలి వార్తలు పుట్టుకు వస్తున్నాయి. ఆ వార్తలు ఎంత వరకు నిజం అనేది క్లారిటీ కావాలంటూ బన్నీ ఫ్యాన్స్ గగ్గోలు పెడుతున్నారు. ఇటీవలే రష్మిక పాత్ర అయిన శ్రీవల్లిని ఈ సినిమా లో చంపేయబోతున్నారు అనేది మొదటి వార్త.

శ్రీవల్లి పాత్ర గురించి సోషల్‌ మీడియాలో చర్చ జరుగుతున్న సమయంలోనే ఈ సినిమా లో ఫారిన్ బ్యూటీని నటింపజేసేందుకు దర్శకుడు సుకుమార్ ప్లాన్‌ చేశాడని.. ఇప్పటికే ఇద్దరు ముగ్గురు విదేశీ ముద్దుగుమ్మలను ఎంపిక చేసి ఆడిషన్స్ కు రెడీ చేస్తున్నాడని ప్రచారం జరుగుతోంది.

ఇందులో నిజం ఎంత అనే విషయం లో క్లారిటీ లేదు.. కాని బన్నీ ఫ్యాన్స్ మాత్రం శ్రీవల్లి చనిపోవడంతో విదేశీ ముద్దుగుమ్మతో పుష్ప రొమాన్స్ చేస్తాడా అంటూ ఎవరికి తోచిన విధంగా వారు ఊహించేసుకుంటున్నారు.

పుష్ప 2 కథ విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి లీడ్స్ కాని లీక్స్ కాని యూనిట్‌ సభ్యుల నుండి రాలేదు.. మీడియాలో సర్క్యులేట్‌ అవుతున్న వార్తలన్నీ కూడా కేవలం పుకార్లే అని వాదించేవారు కూడా లేకపోలేదు. మొత్తానికి అల్లు అర్జున్ మరియు సుకుమార్‌ కాంబో పుష్ప 2 సినిమా మరో రేంజ్ లో ఉంటుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది. కేజీఎఫ్ 2 స్థాయిలో వెయ్యి కోట్లకు పుష్ప 2 వెళ్లాలని బన్నీ ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు.
Tags:    

Similar News