మాస్ మహారాజ్ రవితేజ సినిమాతో ఆర్జీవీ సినిమాకి పోటీ ఏంటి? అసలు ఆర్జీవీ రవితేజనే ఎందుకు వెంటాడుతున్నాడు? అసలు వీళ్లిద్దరికీ మధ్య పడడం లేదా? అయినా వీళ్లంతా ఒకే కాంపౌండ్ కదా? ఒకరి సినిమాలపై ఇంకొకరు పోటీకి దిగుతున్నారేంటి? ఇటీవలి కాలంలో నిర్మాతలంతా రింగ్ అయిపోయి వారానికో సినిమా రిలీజ్ చేస్తూ జనాల నెత్తిన కుచ్చు టోపీ పెడుతోంటే వీళ్లేంటబ్బా! ఒకరిపై ఒకరు విరుచుకుపడుతున్నారు. ఒకరికొకరు కొట్టుకుంటున్నారు. అసలేం జరుగుతోంది? ఏందీ కథ?!
ఈనెల 10వ తేదీన బెంగాల్ టైగర్ రిలీజవుతోంది. మాస్ మహారాజ్ కెరీర్ లో ఇదో కీలకమైన సినిమా. అతడి కెరీర్ ని టర్నింగ్ తిప్పేసే సినిమా అవుతుందని భావిస్తున్నారు. అయితే ఎంత పెద్ద మాస్ రాజా అయితే నాకేంటి? అన్న తీరుగా రామ్ గోపాల్ వర్మ ఆ మరుసటి రోజే తన సినిమా కిల్లింగ్ వీరప్పన్ ని రిలీజ్ చేస్తున్నాడు. బెంగాల్ టైగర్ భారీ బడ్జెట్ సినిమా. దానిముందు వర్మ తెరకెక్కించిన కిల్లింగ్ వీరప్పన్ నిలబడుతుందా? అన్న ప్రశ్న ఉదయించింది. వీరప్పన్ ట్రైలర్స్ బావున్నాయ్. కానీ అంత విషయం సినిమాలో లేకపోతే బెంగాల్ టైగర్ ముందు నిలుస్తుందా? అన్న ప్రశ్న మొదలైంది.
అంతేనా గతంలోనూ రవితేజ నటించిన పవర్` సినిమాపై పోటీకి వదిలాడు అనుక్షణం మూవీని. పవర్ ముందు నిలవలేక అనుక్షణం డిజాస్టరైంది అంటూ ఉదాహరణ చూపిస్తున్నారు ఎనలిస్టులు. అయితే ఈసారి కిల్లింగ్ వీరప్పన్ తో కసి తీర్చుకుంటాడా? టైగర్ మీద వీరప్పన్ గన్ పేలుతుందా? అన్నది తేలాల్సి ఉంది.