17 వయసుకే ప్రియురాలు.. కకావికలమైన హీరో..
నేను నా జీవితాన్ని నా మనస్సులో ప్లాన్ చేసుకున్నాను. కానీ తను అందని తీరాలకు వెళ్లింది. దాంతో నా మనసు ముక్కలైంది... గుండె పగిలింది! అన్నాడు.
``ప్రేమించిన అమ్మాయినే పెళ్లాడాలని చాలా కలలు కన్నాను.. కానీ నా కలలు కల్లలయ్యాయి. ఏదీ నా చేతిలో లేకుండా పోయింది``అని ఆవేదన చెందాడు స్టార్ హీరో వివేక్ ఒబెరాయ్. 17 వయసులో క్యాన్సర్ తో మృతి చెందిన తన ప్రియురాలిని గుర్తు చేసుకుని తాజా ఇంటర్వ్యూలో బాధను వ్యక్తం చేసాడు. మేం కలిసి కాలేజీకి వెళ్లాలి.. పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలి అని ఊహించాను. నేను నా జీవితాన్ని నా మనస్సులో ప్లాన్ చేసుకున్నాను. కానీ తను అందని తీరాలకు వెళ్లింది. దాంతో నా మనసు ముక్కలైంది... గుండె పగిలింది! అన్నాడు.
``నేను నా స్నేహితురాలిని.. ఆమె కుటుంబాన్ని చేరుకోలేని పరిస్థితుల్లో బంధువుకి కాల్ చేసాను. తను ఆసుపత్రిలో ఉందని చెప్పారు. నేను అక్కడికి పరుగెత్తాను. మేం ఐదారు సంవత్సరాలుగా సంబంధంలో ఉన్నాం. తను నా డ్రీమ్ గాళ్. నా బంగారం తీవ్రమైన లింఫోబ్లాస్టిక్ లుకేమియాతో బాధపడుతోంది. చివరి దశలో ఉందని తెలిసింది. ఇది పూర్తిగా నాకు షాక్. మేం ఎన్ని ప్రయత్నాలు చేసినా కేవలం రెండు నెలల్లోనే మరణించింది. నా మనసు ముక్కలైంది. గుండె పగిలింది`` అని తెలిపాడు. ఆ సమయంలో నాకు 18 సంవత్సరాల వయసు అని కూడా ఒబెరాయ్ చెప్పాడు. ఆ తర్వాత కూడా చాలా కాలం పాటు నాతోనే ఉందని అనుకునేవాడిని.. తను చనిపోయిందని కూడా అంగీకరించలేకపోయానని అన్నాడు.
నిజ జీవితం గురించి మాట్లాడేటప్పుడు వివేక్ ఒబెరాయ్ ఎప్పుడూ తెరిచి ఉంచిన పుస్తకం. అతడు ఐశ్వర్య రాయ్ నుంచి విడిపోయిన తర్వాత పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని కూడా అన్నాడు. వివేక్ ఒబెరాయ్ 2010లో దివంగత కర్నాటక మంత్రి జీవరాజ్ అల్వా , ప్రముఖ నర్తకి నందిని ల కుమార్తె అయిన ప్రియాంక అల్వాను వివాహం చేసుకున్నారు. అమేయ నిర్వాణ, కుమారుడు వివాన్ వీర్‌లకు వీరు ఇప్పుడు తల్లిదండ్రులు. కెరీర్ మ్యాటర్ కి వస్తే.. వివేక్ ఒబెరాయ్ తదుపరి `మస్తీ 4`లో కనిపించనున్నారు.