పూజా ఇదేం మాస్ విధ్వంసం బాబోయ్..!
గత రెండేళ్లుగా పూజా కి అసలే మాత్రం టైం కలిసి రాలేదు. ఐతే అమ్మడు మాత్రం ఏమాత్రం కాన్ఫిడెన్స్ లూజ్ అవ్వకుండా ఉంటూ వచ్చింది.
బుట్ట బొమ్మ పూజా హెగ్దే కెరీర్ దాదాపు ముగిసింది.. ఇక అమ్మడు ఏం చేసినా అవకాశాలు రావనుకున్న వారందరికీ ఆమె చేస్తున్న సినిమాల లిస్ట్ చూసి ఫ్యూజులు అవుట్ అయ్యాయి. తెలుగులో రాధే శ్యాం, ఆచార్య.. తమిళ్ లో బీస్ట్.. హిందీలో కిసి కా భాయ్ కిసి కి జాన్ ఫలితాలన్నీ నిరాశ పరచడంతో పూజా హెగ్దే కెరీర్ రిస్క్ లో పడింది. గత రెండేళ్లుగా పూజా కి అసలే మాత్రం టైం కలిసి రాలేదు. ఐతే అమ్మడు మాత్రం ఏమాత్రం కాన్ఫిడెన్స్ లూజ్ అవ్వకుండా ఉంటూ వచ్చింది. ప్రస్తుతం బాలీవుడ్ లో షాహిద్ కపూర్ తో దేవా సినిమా చేస్తున్న పూజా హెగ్దే ఆ సినిమాతో తిరిగి ఫాం లోకి రావాలని చూస్తుంది.
ఐతే అనూహ్యంగా పూజాకి వరుస సినిమా ఛాన్స్ లు వస్తున్నాయి. ఇప్పటికే సూర్య రెట్రోలో ఛాన్స్ దక్కించుకున్న పూజా హెగ్దే నెక్స్ట్ దళపతి విజయ్ చివరి సినిమాలో కూడా అవకాశం పట్టేసుకుంది. అదే తమిళ్ లో లారెన్స్ తో కలిసి కాంచనా 4లో కూడా ఛాన్స్ పట్టేసిందని తెలుస్తుంది. కోలీవుడ్ లో ఒకేసారి 3 సినిమాల ఆఫర్ అందుకున్న పూజా బేబ్ ఆ సినిమాతో అదరగొట్టబోతుందని చెప్పొచ్చు. ఇక మరోపక్క హిందీలో కూడా పూజా నెక్స్ట్ వరుణ్ ధావన్ చేస్తున్న సినిమాలో కూడా ఆమె నటించబోతున్నట్టు తెలుస్తుంది.
ఇదే కాకుండా తెలుగులో ఎస్.ఎల్.వి సినిమాస్ నిర్మిస్తున్న సినిమాలో దుల్కర్ సల్మాన్ హీరోగా చేస్తుండగా ఆ సినిమాలో కూడా పూజా హెగ్దే లక్కీ ఛాన్స్ పట్టేసిందట. ఇలా వరుసగా ఐదారు సినిమాలతో పూజా కంబ్యాక్ ఒక రేంజ్ లో ఉండబోతుందని అనిపిస్తుంది. మొన్నటిదాకా చేతిలో సినిమాలు లేక డైలమాలో ఉన్న పూజా ఇప్పుడు ఒకేసారి సినిమాలన్నీ రావడంతో ఫుల్ హ్యాపీగా ఉంది. పూజా హెగ్దే ఈ మాస్ విధ్వంసం చూస్తే మాత్రం ఫ్యాన్స్ అంతా కూడా ఫుల్ ఖుషి అవుతున్నారు.
పూజా బేబి ఈ సినిమాలతో మరోసారి తన సత్తా చాటనుంది. ఐతే ఇందులో కొన్ని పాత్ర ప్రాధాన్యత ఉన్న సినిమాలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఐతే పూజా హెగ్దే మాత్రం తన గ్లామర్ తో ఆడియన్స్ కి మరోసారి ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది. ఐతే అంతా బాగుంది కానీ అమ్మడు తెలుగులో కూడా వరుస సినిమాలు చేస్తే చూడాలని అమ్మడి తెలుగు ఫ్యాన్స్ కోరుతున్నారు.