SSMB29 జోడి.. రికార్డులకు తెరలేపే కాంబినేషన్!

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు రాజమౌళి కలయికలో రానున్న అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ SSMB29 గురించి రోజుకో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వస్తోంది

Update: 2024-12-27 14:54 GMT

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు రాజమౌళి కలయికలో రానున్న అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ SSMB29 గురించి రోజుకో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వస్తోంది. తాజాగా ఈ చిత్రంలో గ్లామరస్ నటి ప్రియాంక చోప్రా కథానాయికగా ఎంపికైనట్లు మరో బజ్ మొదలైంది. ప్రియాంక చోప్రా అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన నటి కావడంతో ఆమెనే ఫిక్స్ చేసేలా ఉన్నట్లు గతంలో టాక్ వచ్చింది. ఇక మహేష్ రాజమౌళి కాంబినేషన్‌పై ఇప్పటికే ఉన్న హైప్, ఈ ప్రాజెక్ట్‌ను పాన్ వరల్డ్ స్థాయికి తీసుకెళ్తున్నాయి.

మహేష్ బాబు ఈ చిత్రంలో యూనిక్ క్యారెక్టర్‌ను పోషించబోతున్నారట. అమెజాన్ అడవులను బ్యాక్‌డ్రాప్‌గా తెరకెక్కించబడుతున్న ఈ కథలో ప్రియాంక పాత్రకు స్పెషల్ సీక్వెన్స్‌లు ఉంటాయట. ఈ చిత్రం మొదట్నుంచీ ఇంటర్నేషనల్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తున్నట్లు లీక్స్ వస్తున్నాయి, ఇక ప్రియాంక చోప్రా ఎంపిక అంచనాలను రెట్టింపు చేస్తోంది. గతంలో కూడా ప్రియాంక కొన్ని హాలీవుడ్ ప్రాజెక్ట్‌లలో మెరిసి, గ్లోబల్ లెవెల్‌లో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. ఇప్పుడు మహేష్ బాబుతో కలిసి ఆమె నటిస్తే క్రేజ్ మాములుగా ఉండదు.

ఈ ప్రాజెక్ట్‌పై రాజమౌళి చాలా ఇంటెన్స్‌గా వర్క్ చేస్తున్నారని సమాచారం. అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం తెలుగు సినిమా స్థాయిని మరింత పెంచేలా ఉండబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. రాజమౌళి దర్శకత్వంలో గత చిత్రాలు బాహుబలి సిరీస్, RRR సినిమాలు భారీ విజయం సాధించాయి. ఇప్పుడు SSMB29 కూడా అదే రేంజ్‌లో బ్లాక్‌బస్టర్ హిట్టు కొట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు ఆశిస్తున్నాయి.

మరోవైపు, ప్రియాంక చోప్రా అభిమానులు ఈ వార్తపై హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మహేష్ బాబు మొదటిసారి హాలీవుడ్ స్థాయి కథానాయికతో నటించడం ఆయన కెరీర్‌లో మరో క్రేజీ కాంబినేషన్ గా నిలుస్తుందనడంలో సందేహం లేదు. ఈ ప్రాజెక్ట్ గ్లోబల్ లెవెల్‌లో ఎంతటి ఇంపాక్ట్‌ను క్రియేట్ చేస్తుందో చూడాలి. పైగా రాజమౌళి డైరెక్షన్‌లో కంటెంట్ ఎలా ఉంటుందనేది ఇప్పటికే ప్రేక్షకుల్లో పెద్ద క్యూరియాసిటీని సృష్టించింది.

ఇంకా, ఈ చిత్రం షూటింగ్ 2025 ప్రారంభంలో మొదలవుతుందని సమాచారం. షూటింగ్ కోసం ఇప్పటికే పలు లొకేషన్‌లను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే వరకు ఈ వార్తపై అంచనాలు మరింత పెరగడం ఖాయం. దాదాపు 1000 కోట్ల బడ్జెట్ తో రెండు భాగాలుగా ఈ సినిమా రూపొందే అవకాశం ఉంది. ఇక సినిమాకు సంబంధించిన వర్క్ షాప్ ఇదివరకే స్టార్ట్ అయినట్లు సమాచారం.

Tags:    

Similar News