సోషల్ మీడియా యుగంలో ఎంతో జాగ్రత్త అవసరం. ఎక్కడ తప్పు చేసి దొరికినా అదో డిబేట్ గా మారిపోతుంది. కానీ ఎంత జాగ్రత్త పడినా కానీ ఒక్కోసారి కొందరు తారలు ఇట్టే దొరికిపోతుంటారు. తాజాగా హాలీవుడ్ పాప్ స్టార్ కిమ్ కర్ధాషియన్ ఎరక్కపోయి ఇరుక్కుపోయింది. కిమ్ కర్దాషియాన్ మార్లిన్ మన్రో కి చెందిన ఐకానిక్ దుస్తులను పాడు చేసిందంటూ నెటిజనులు ట్రోల్ చేస్తున్నారు.
కిమ్ కర్దాషియాన్ మార్లిన్ మన్రో(1962) ఐకానిక్ దుస్తులను మెట్ గాలా 2022 ఈవెంట్ కోసం ధరించింది. ఈ డ్రెస్ డ్యామేజ్ కావడానికి కిమ్ కారణమైందని అభిమానులు ఆరోపిస్తున్నారు. గిల్డెడ్ గ్లామర్ ఇతివృత్తంతో డ్రెస్ ని డ్యామేజ్ చేసారని ఆరోపిస్తున్నారు. దీనిపై నెటిజనులు తమ అభిప్రాయాలను షేర్ చేస్తున్నారు. కిమ్ కర్దాషియాన్ ఇటీవల తన బాయ్‌ఫ్రెండ్ పీట్ డేవిడ్ సన్ తో కలిసి బీచ్ వాకే ఫోటోలను షేర్ చేయడం ద్వారా హెడ్ లైన్స్ లోకి వచ్చింది.
1962లో మార్లిన్ మన్రో ధరించిన ఐకానిక్ డ్రెస్ తో కిమ్ మెట్ గాలా 2022లో కనిపించింది. ఇప్పుడు కిమ్ కర్దాషియాన్ ఎంతో ఇష్టంగా ధరించిన దుస్తులు పాడైపోయినట్లు కనిపిస్తున్నాయి. కిమ్ హాలీవుడ్ లోని రిప్లీ మ్యూజియం నుండి అరువు తెచ్చుకున్న షీర్ క్రిస్టల్ స్టడెడ్ డ్రెస్ ని ధరించగా...ఆ ఐకానిక్ దుస్తులను కిమ్ పాడు చేసిందని నెటిజనులు ఆరోపిస్తున్నారు.
మార్లిన్ ధరించిన దుస్తుల ఫోటోలు ఆన్ లైన్ లో వైరల్ అవుతున్నాయి. జిప్ లైన్ వైపు సాగదీసినట్లు డ్రెస్ లో డ్యామేజీ కనిపిస్తోంది. కొన్ని స్ఫటికాలు కూడా కనిపించడం లేదని నెటిజనులు ఆరోపిస్తున్నారు. ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ పోర్టల్ లో షేర్ చేసిన మార్లిన్ డ్రెస్ ఒరిజినల్ ఫోటోలు కూడా ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. అలాగే డిజైనర్లు మార్లిన్ దుస్తులను కిమ్ కు సెట్ చేయడానికి చాలా కష్టపడ్డారని కూడా కనిపిస్తోంది. కిమ్ పర్సనాలిటీకి అవి సెట్ కావు. కానీ ఐకానిక్ దుస్తులను పాడు చేసిందనే నిజం అసలే దాగలేదు.
మార్లిన్ దుస్తులు ధరించినందుకు కిమ్ పై కొందరు తీవ్రంగా విరుచుకుపడ్డారు. మెట్ గాలా 2022లో కిమ్ కర్దాషియాన్ ఈ దుస్తులను ధరించినప్పుడు లుక్ పై మిశ్రమ స్పందన లభించింది. కొందరు కిమ్ డిజైనర్ లుక్ ని ఇష్టపడితే.. ఐకాన్ మార్లిన్ కి సంబంధించిన ఐకానిక్ దుస్తులను ధరించడం చాలామందికి నచ్చలేదు. ఇప్పుడు డ్యామేజ్ అయిన డ్రెస్ పై వార్తలు రావడంతో.. అందమైన దుస్తులను పాడు చేసినందుకు ప్రజలు కిమ్ పై విరుచుకుపడుతున్నారు. రిప్లీస్ లోని సిబ్బంది .. అధికారుల తరహాలోనే కిమ్ పై చాలా విమర్శలు వచ్చాయి. ద్వేషంతో పాటు కిమ్ కు మద్దతు కూడా లభిస్తోంది. ఇంత చిన్న విషయాన్ని అంత పెద్దగా చూపించడం తగదని కొందరు సూచిస్తున్నారు. కిమ్ ధరించడం వల్లనే అలా కాలేదని కొందరు.. ఇంకా ఆ డ్రెస్ మర్లిన్ సమాధిలోనే ఉందని కొందరు నెటిజనులు వ్యాఖ్యానించారు.